BigTV English

Duvvada : మీ సావు మీరు సావండి.. దువ్వాడ, దివ్వెల డ్యాన్స్ ఇరగదీశారుగా!

Duvvada : మీ సావు మీరు సావండి.. దువ్వాడ, దివ్వెల డ్యాన్స్ ఇరగదీశారుగా!

Duvvada Srinivas Madhuri : దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. మేడ్ ఫర్ ఈచ్ అదర్. మోస్ట్ పాపులర్ కపుల్ ఇన్ 2 తెలుగు స్టేట్స్. టింగురంగా అంటూ తిరుగుతుంటారు. ఆడుతారు.. పాడుతారు.. ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఎవరేం అనుకున్నా పట్టించుకోరు. వారి లోకం వారిదే. నిత్యం ప్రేమ మైకంలో విహరిస్తుంటారు. అడ్డొచ్చిన దువ్వాడ వాణితో గొడవలు పెట్టుకుంటారు. ఆస్తులు పంచుకుంటారు. అబ్బో వారి వేషాలు ఏడాది కాలంగా తెలుగు వారికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.


దువ్వాడ ఫ్యామిలీ గోల పడలేక.. ఏకంగా శ్రీనివాస్‌ను వైసీపీ నుంచి వెళ్లగొట్టేశారు జగన్. ఇంకేం. పార్టీ లేదు, పాలిటిక్స్ లేవు. మరింత ఫ్రీ బర్డ్స్‌లా ఆ లవ్ బర్డ్స్ ఇంకా రెచ్చిపోతున్నారు. ఓవైపు వైసీపీ లీడర్లంతా వరుసగా జైలుకు వెళుతుంటే.. అమరావతి వేశ్యల రాజధాని అంటూ రచ్చ జరుగుతుంటే.. అవేవీ పట్టనట్టు. మీ సావు మీరు సావండంటూ.. ఈ వైసీపీ మాజీ నేత తనదైన స్టైల్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.

దువ్వాడ జంట డ్యాన్స్


లేటెస్ట్‌గా దువ్వాడ కూతురు హాఫ్ శారీ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్ వెడ్డింగ్ రేంజ్‌లో జరిగింది. సంగీత్ మాదిరి మ్యూజికల్ నైట్ అరేంజ్ చేశారు. డ్యాన్స్ ఫ్లోర్ మీద ఎలక్ట్రానిక్ స్క్రీన్స్, లేజర్ లైట్స్‌తో దుమ్ము రేపారు. మాధురి తన టాలెంట్ అంతా చూపించారు. శ్రీను చిందులేసి, గెంతులేసి.. తెగ డ్యాన్స్‌ చేశారు. మాధురి, శ్రీనుల ఆ డ్యూయెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రొమాంటిక్ సాంగ్.. దువ్వాడ రొమాన్స్

ఓ బాలీవుడ్ పాత సాంగ్‌కు స్టెప్పులేశారు ఆ జంట. దువ్వాడ శ్రీనివాస్ సూటుబూటు వేసుకుని.. పెద్ద బొట్టు పెట్టుకుని.. దసరా బుల్లోడిలా రెడీ అయ్యారు. మాధురి ఎప్పటిలానే బ్యూటీ క్వీన్‌లా తయారయ్యారు. ఒంటి నిండా నగలతో.. ఆకుపచ్చ శారీతో స్టేజీ మీదకు వచ్చారు. ఇక చూడాలి డయాస్ మీద వాళ్ల రొమాన్స్. రొమాంటిక్ సాంగ్‌కు షూటబుల్‌గా స్టెప్స్ వేస్తూ.. ఖతర్నాక్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ.. మైమరచి డ్యాన్సు చేశారు. చుట్టూ పబ్లిక్ ఉన్నారనే విషయం పట్టించుకోకుండా.. ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ.. ప్రేమను జువ్వుకుంటూ.. ఆనంద పారవశ్యంతో తాంఢవం ఆడారు.

పడి పడి లేచే మనసు..

దువ్వాడ శ్రీను స్టెప్పులకు మాధురి మనసు పడి పడి లేచింది. పగలబడి నవ్వింది. తనను తాను కంట్రోల్ చేసుకోలేక పోయింది. శ్రీనివాస్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటూ నాన్‌స్టాప్ డ్యాన్స్ చేశారు. మాధురి చుట్టూ తిరుగుతూ.. ఫోజులు కొడుతు.. లవర్ వెంట తిరిగే టీనేజ్ కుర్రాడిలా.. డ్యూయెట్ ఆడిపాడారు. ఆ జంట చేసిన డ్యాన్స్‌ను తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు మాధురి. వారి డ్యాన్స్ సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.

Related News

Bonda Uma On Pawan: పవన్ ను పొగుడుతూ బొండా ఉమా వరుస ట్వీట్లు.. వివాదం ముగిసినట్లేనా?

AP Rains: ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Vahana Mitra Scheme: వాహన మిత్ర పథకం దరఖాస్తులో సమస్యలా? అయితే ఇలా చేయండి?

Tirumala: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు

CM Chandrababu: మీ ఇంటికి వచ్చి ఓ వస్తువు ఇస్తారు.. మీ చెత్త వారికి ఇవ్వండి.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Bonda Vs Pawan: బొండా ఉమ ఓవర్ చేస్తుండు.. సంగతేంటో చూడండి.. బాబుకు పవన్ కంప్లైంట్

Jagan In Assembly: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!

MLCs Jump: ముగ్గురు ఎమ్మెల్సీలు జంప్.. తేలు కుట్టిన దొంగలా వైసీపీ

Big Stories

×