E-Paper
Advertisement

Jagan Birthday: జగన్ పుట్టినరోజు నేడు.. బెడిసికొట్టిన నేతల ప్లాన్, విమానంలో ‘షో’, ఏం జరిగింది?

Jagan Birthday: జగన్ పుట్టినరోజు నేడు.. బెడిసికొట్టిన నేతల ప్లాన్, విమానంలో ‘షో’, ఏం జరిగింది?
Advertisement

Jagan Birthday: వైసీపీ అధినేత జగన్‌ తీరు మారలేదా? జనం లేకుంటే అధినేత బయటకు రావడం కష్టమేనా? ఏదో విధంగా తమ పార్టీకి జనాదరణ ఏ మాత్రం తగ్గలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? బర్త్ డే ముందురోజు బెంగళూరుకి వెళ్లిన జగన్‌కు విమానంలో ఏంజరిగింది? బర్త్‌డే సెట్టింగ్‌ ప్లాన్ బెడిచి కొట్దిందా? నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఎందుకు ఆటాడుకుంటున్నారు?

జగన్.. విమానంలో బర్త్ డే షో

Advertisement

నార్మల్‌గా ప్రజాధరణ ఉన్న నేతలు తమ పుట్టినరోజును నేతలు, అభిమానుల మధ్య జరుపుకుంటారు. ఎందుకంటే ప్రజలే మా ఆస్తి అని పదేపదే చెబుతుంటారు. అయినా కొందరి నేతల తీరు ఏ మాత్రం మారలేదు. ఆదివారం వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు. ఎక్స్ వేదికగా ఆ పార్టీ ఓ పోస్టు పెట్టింది. ‘మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు’ వైఎస్ జగన్ అంటూ రాసుకొచ్చింది.

జనం మెచ్చిన జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు రాసుకొచ్చింది. ఇందులో ఏ మాత్రం తప్పులేదు. అధినేత కాబట్టి ఆ మాత్రం తప్పదు. జగన్‌కు పుట్టినరోజు కావడంతో  సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు.

Advertisement

బెడిసికొట్టిన నేతల ప్లాన్, విమానంలో ఏం జరిగింది?

తన పుట్టినరోజును నేతలు, అభిమానులకు దూరంగా జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు మాజీ సీఎం జగన్. ఈ నేపథ్యంలో శుక్రవారం బెంగుళూరుకి వెళ్లారు. అయితే విమానంలో ఓ బాలిక.. జగన్‌కు పుష్ప గుచ్ఛం అందించేలా వేసిన సెట్టింగ్‌ నవ్వుల పాలైంది. జగన్‌ ప్రజాదరణ నేత అని, ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు, అభిమానులు చుట్టుముడతారని పదేపదే చెబుతుంటారు ఆ పార్టీ నేతలు.

చివరకు ఎయిర్‌పోర్టుకి వెళ్లినా అటు ఇటూ అభిమానులు.. జగనన్నా అంటూ నినాదాలు ఓవైపు.. ఇంకోవైపు ఈలలు, కేకలు వినిపించడం చూస్తూనే ఉంటాం. శుక్రవారం ఎంపీ మిథున్‌రెడ్డితో కలసి జగన్‌ విమానంలో బెంగళూరుకు వెళ్లారు. ఫ్లయిట్‌లో జగన్ తన సీటు వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఓ బాలిక.. జగన్‌కు హ్యాపీ బర్త్‌ డే చెప్పి పూల బొకే ఇచ్చింది.

ఆప్యాయంగా ఆ బాలికను పలకరించినట్టుగా ఓ వీడియోను వైసీపీ సోషల్‌ మీడియాలోకి వదిలింది. జగన్‌ విమానంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురుగా ఉన్న కొంతమంది ఆ వీడియో చిత్రీకరించినట్టు కనిపించింది. వాళ్లు ఆ వీడియో తీసినట్టు చెబుతున్నారు. బాలిక దుస్తులపై హ్యాపీ బర్త్‌డే జగన్‌ మామ అని రాసి ఉంది.  ఇది విమానం అంటూ జగన్ మాటలు వినిపించాయి.

ALSO READ: రేయ్.. మీరు మనుషులా? కుక్కలా? మరీ ఆ ప్లేస్‌లో కొరకవచ్చా?

జగన్‌ తన సీటు వద్దకు వచ్చేసరికి బాలిక సిద్ధంగా ఉండటం వంటివి చాలామంది నెటిజన్స్ అనుమానాలు వచ్చాయి. బస్సు, రైళ్లలో స్వేచ్ఛగా తిరిగినట్టు విమానాల్లో చిన్నారులను అస్సలు తిరగనీయరు. చాలా నియంత్రలు ఉంటాయి. ఇదంతా సినిమా తరహాలో చిత్రీకరించారని అంటున్నారు నెటిజన్స్.

ఆ బాలిక తల్లిదండ్రులకు జగన్‌ ఆ విమానంలో వస్తున్నారని ఎలా తెలుసు? ఆ వీడియో చూసినవారికి వచ్చిన మొదటి సందేహం. నిశితంగా గమనిస్తే బొకేతోపాటు జగన్‌ సీటు పక్కన కేక్ కనిపించింది. సెక్యూరిటీ చెక్‌ గట్టిగా ఉన్నా, వాటిని విమానంలోకి ఎలా తెచ్చారంటూ నెటిజన్లు పలు ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.  మొత్తానికి ‘విమానం షో’ బెడిసికొట్టిందనే వాదనలు లేకపోలేదు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×