E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా రెడ్ కలర్ ప్లాన్ సక్సెస్.. భూషణ్ ఒప్పుకుంటాడా..? నిజం తెలుసుకున్న చక్రి..

Podarillu Today Episode : మహా రెడ్ కలర్ ప్లాన్ సక్సెస్.. భూషణ్ ఒప్పుకుంటాడా..? నిజం తెలుసుకున్న చక్రి..
Advertisement

Podarillu Today Episode December 21st: పెళ్లి చీరల కోసం భూషణ్ తల్లితో కలిసి మహా కుటుంబం షాపింగ్ కు వెళ్తుంది.. ఎలాగైనా సరే వీళ్ళతో పాటే నేను షాప్ లోకి వెళ్లి పోవాలని చక్రి కూడా అనుకుంటాడు. మహా ఏ చీర తీసుకున్న అది బాగోలేదని చెప్తూ ఉంటాడు. నాకు కాస్త తలనొప్పిగా ఉంది నువ్వే చూడు వదినా అని మహా పక్కకు వెళ్ళిపోతుంది.. చక్రి వీళ్లు నన్ను ఏమనకుండా ఇక్కడే ఉండాలంటే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ ఉండాలని అనుకుంటాడు. అక్కడ తాను కూడా బట్టలు కొనాలని అనుకున్నట్లు నటిస్తూ ఉంటాడు. అక్కడే ఉన్నా షర్ట్లు కౌంటర్ దగ్గరికి వెళ్లి ఓ మంచి షర్టు చూపించండి అని అడుగుతాడు. షాప్ సేల్స్ మెన్ తో చక్రి మాట్లాడిన తీరు కాస్త కామెడీగా ఉంటుంది. మహాకు చీరలు నచ్చకపోవడంతో ఒక చోట కూర్చుంటుంది. చక్రి మహా మనసులో ఎలాగైనా చోటు సంపాదించుకోవాలని అనుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ప్రోమో విషయానికొస్తే.. మీ అమ్మగారికి నచ్చినవే కొనాలి కదా నేనెందుకు ఇంకా అక్కడ మీ అమ్మకు ఉంటేనే సరిపోతుంది కదా అని మహా కౌంటర్ ఇస్తుంది.. మహా ఏంటి అలా మాట్లాడుతున్నావు రా వచ్చి చీరలు చూడు అనేసి అది అడుగుతాడు.. ఇక మహా ఆది బలవంతం చేయడంతో అక్కడికి వచ్చి చీరలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అటు మాధవ్ ఈ పెళ్లి సంబంధం చెడిపోయిందని బాధపడుతూ ఉంటాడు. నువ్వేం బాధపడకు అన్నయ్య నీకు ఇలాంటివి మంచి సంబంధం కూడా వస్తుంది. మాధవ్ నేనేమీ బాధపడడం లేదు కన్నాకి ఈ విషయం తెలిస్తే వాడు ఎక్కడ బాధపడతాడు అని అనుకుంటున్నాను అని మాధవ్ అంటాడు. గాయత్రి మాత్రం ఈ సంబంధం చెడిపోయిందని చాలా సంతోషంగా ఉంటుంది. అటు తాయారు సంబంధం గురించి తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది.

Advertisement

నా శాపం ఊరికి పోదు వాళ్లకి జన్మలో పెళ్లి కాదు అలానే ఉంటారు అని అనుకుంటుంది.. లేకుంటే ఆ నారాయణ నా మాటనే కాదంటాడా నాకు ఆస్తులు వాటా ఇవ్వనంటాడా ఇప్పుడు ఎలా ఇవ్వడం నేను చూస్తాను.. ఆ ఇంటిని చూస్తే ఎవ్వరు కూడా పిల్లనివ్వడానికి ముందుకు రారు.. ఇక నారాయణ పిల్లలకి పెళ్లిళ్లు కావు అని అనుకుంటుంది.. చక్రి మాత్రం అన్నయ్య పెళ్లి కన్నా ముందు నేనే పెళ్లి చేసుకోవాలి అని ఎన్నో కలలు కంటూ ఉంటాడు.. మహా మనసులో ఎలాగైనా సరే చూడు సంపాదించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

షాప్ లో అతను చేసిన విన్యాసాలకి ఇంట్లోని వాళ్లందరికీ కాస్త డౌట్ వచ్చినా సరే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇక చీరల విషయంలో రెడ్ కలర్ తనకు చాలా ఇష్టమని మహా కావాలని భూషణ్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. తనకి నచ్చకపోతే నాకు ఇష్టం అందుకే నేను ఇవే తీసుకుంటాను అని మహా కావాలని అంటుంది.. చూసావా అది మీ చెల్లెలు నా మాట ఇప్పటినుంచి వినట్లేదు ఇక పెళ్లయిన తర్వాత ఏం వింటుంది అని అంటాడు. మహా నీకు రెడ్ కలర్ అంటే ఇష్టం లేదు కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అది అడుగుతాడు.. నాకు ఆ కలర్ ఇష్టం లేదని నీకు చెప్పానా లేదు కదా నాకు ఆ కలర్ లోనే చీర కావాలి అని అంటుంది.

Advertisement

ఇక చీరల పని అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్లి పోతారు. చక్రి మహా గురించి తన ఇంట్లో అందరికీ చెప్పి సంతోషంగా ఉంటాడు. ఆ అమ్మాయి నా జీవిత భాగస్వామి అయితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు.. తర్వాత రోజు ఉదయం ఇందాకటి నుంచి పెళ్లి పెళ్లి అంటున్నారు ఎవరి పెళ్లి సార్ అని ఆదిని చక్రి అడుగుతారు.. నా చెల్లెలు పెళ్లి అదిగో ఆ అమ్మాయి నా చెల్లెలు అని అంటాడు. మహని చూసి షాక్ అయిపోతాడు చక్రి.. ఏంటి ఈ అమ్మాయికి పెళ్లి అయ్యో నా అదృష్ట దేవత వెళ్ళిపోతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు.

Also Read : కుటుంబంతో సొంతూరికి వెళ్లిన రాజేంద్ర.. కన్నతల్లి సమాధి వద్ద అక్షయ్ ఎమోషనల్.. భానుమతి కన్నీళ్లు..

ఆ తర్వాత అమ్మాయికి పెళ్లి ఇష్టము కాదు తెలుసుకోవాలి ఎలాగైనా సరే నా మనసులోని మాటను అమ్మాయికి చెప్పాలి అని అనుకున్నాడు. భూషణ్ మహా ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. నేను పెళ్లి తర్వాత కూడా జాబ్ చేయాలని అనుకుంటున్నాను అని మహా అడుగుతుంది. నీకున్న నాలెడ్జ్ కి నువ్వు జాబ్ చేయాలన్న ఆలోచన కూడా రాకూడదు అని అంటాడు. నాకేం తక్కువ నేను ఇంజనీరింగ్ చేశాను కదా దాని మీదే జాబ్స్ వెతుక్కుంటాను అని అంటుంది. ఆ మాటకి సీరియస్ అయినా భూషణ్ నువ్వు జాబ్ కి వెళ్లి జాబ్ చేస్తూ ఉంటే నేనేం చేయాలి ఇంట్లో కూర్చుని చెక్కభజన చేయాలని సీరియస్ అవుతాడు. భూషణ్ మాట వినగానే మహా భయపడుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. మరి ఓవర్ ఎపిసోడ్లు చక్రి తన ప్రేమ విషయాన్ని మహా కి చెప్తాడేమో చూడాలి..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×