E-Paper
Advertisement

విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు
Advertisement

Students Holidays: ఆగష్టు నెల విద్యార్థులకు పండగే పండగ. ఎందుకంటే ఏకంగా డజను సెలవులు రాబోతున్నాయి. పండగలేవీ లేవు కదా.. అన్ని సెలవులు ఎలా అని భావిస్తున్నారా? అక్కడికే వచ్చేద్దాం. స్వాతంత్య్ర దినోత్సవం, బోనాలు, మిలాద్-ఉన్-నబి వంటి పండుగలు రావడంతో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. ఇప్పుడు ఆ జాబితాను చూద్దాం.

ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు-ఏపీ-తెలంగాణల్లోని విద్యార్థులకు శుభవార్తం. స్కూల్, కాలేజీలు మొదలైన రెండు నెలలకే విద్యార్థులకు సెలవులు మొదలయ్యాయి. ఈసారి ఆగష్టు నెల విద్యార్థులకు దాదాపు 10 నుంచి 12 సెలవులు రాబోతున్నాయి. రెండో శనివారం, ఆదివారాలు, స్వాతంత్య్ర దినోత్సవం, తెలంగాణలో బోనాలు, ముస్లింలకు మిలాద్-ఉన్-నబి వంటి పండగలు రావడంతో వరుస సెలవులు దక్కనున్నాయి. ఈ లెక్కన ఆగష్టు నెల కేవలం 18 నుంచి 20 రోజులు పని దినాలు ఉండనున్నాయి.

Advertisement

విద్యార్థులకు పండగే పండగ- ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెల ఆదివారాలతో కలుపుకుని 10 రోజుల వరకు సెలవులు వచ్చాయి. అందులో ఐదు ఆదివారాలు ఉన్నాయి. మిగతా రోజుల్లో పండగ సెలవులు ఉన్నాయి. ఆగస్టులో 31 రోజులుండగా మూడు వారాలు మాత్రమే స్కూళ్లు-విద్యా సంస్థలు నడుస్తాయి. ఆగష్టు 02 ఆదివారం సాధారణ సెలవు ఉంటుంది. 8, 9న రెండో శని ఆదివారాలు కావడంతో హాలీడ్ ఉంటుంది. 15న శనివారం స్వాతంత్ర్య దినోత్సవం రోజు కావడంతో ఆ రోజు సెలవు. మరుసటి రోజు అనగా 16న ఆదివారం సెలవు ఉంది.

విద్యార్థులు ఫుల్ ఎంజాయ్-21న శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో మాగ్జిమ్ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సెలవు ఉంటుంది. 23న ఆదివారం సాధారణ సెలవు కాగా, 25న మంగళవారం మిలాదున్ నబి పండగ ఉంది. ఆగష్టు 30న అనగా ఆదివారం సాధారణ సెలవు ఉంటుంది. తెలంగాణలో దాదాపు ఆ సెలవులు ఉంటాయి. ఆగష్టు 10న బోనాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది మరుసటి రోజు సెలవు ప్రకటించడం జరుగుతోంది. ఈ సెలవు కేవలం తెలంగాణ వారికి మాత్రమే.

Advertisement

ALSO READ: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. 60 రోజుల్లో ఎన్నికలు, కార్యకర్తలను సిద్ధం చేస్తున్న పార్టీలు

 

Related News

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

Big Stories

Advertisement
×