BigTV English

AvinashReddy: ఈసారి అరెస్టేనా? మళ్లీ పిలిచింది అందుకేనా?

AvinashReddy: ఈసారి అరెస్టేనా? మళ్లీ పిలిచింది అందుకేనా?
avinash reddy

AvinashReddy: అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచినప్పుడల్లా ఇదే ప్రచారం. ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ గోలగోల. ఈయన సైతం భయం భయంగానే విచారణకు వెళ్తున్నారు. వెళ్లే ముందు తనను ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. కానీ, ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేదు. అవినాష్ ముందస్తు బెయిల్‌పై అలు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టులోనూ చుక్కెదురైంది. సో, ఆయనకున్న ఆ ఏకైక రక్షణ కూడా ఇప్పుడు లేకుండా పోయింది. అందుకే, ఈసారి సీబీఐ విచారణకు హాజరైతే.. ఏం జరుగుతుందోననే టెన్షన్. ఇన్నిసార్లు పిలవాల్సిన అవసరం ఏముంది? అరెస్ట్ చేసేందుకే మళ్లీ నోటీసులు ఇచ్చారా? అనే ఉత్కంఠ.


నోటీసులపై మంగళవారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంది అవినాష్‌రెడ్డి. ఇటీవలే వరుసగా మూడురోజుల పాటు సుదీర్ఘంగా విచారించింది సీబీఐ. వివేక హత్య కేసులో ఆయన పాత్రపై అనేక ప్రశ్నలు అడిగింది. అయినా, ఏదో మిస్ అయింది. అవినాష్‌రెడ్డి ఇంకా ఏదో దాస్తున్నారనే అనుమానం. ఆయన సరైన సమాధానం చెప్పట్లేదనే భావన. అందుకే, అప్పుడు పంపించేసినా.. దాదాపు 15 రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ రమ్మని పిలిచారు. అవినాష్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకే అంటున్నారు.

ఈ రెండు వారాల గ్యాప్‌లో చాలా విషయాలే జరిగాయి. అవినాష్ ముందునుంచి ఆరోపిస్తున్నట్టు.. వివేక రాసిన లేఖ, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి పాత్ర, వివేకా రెండో భార్య విషయం.. ఇలా అనేక కోణాల్లో మరోసారి విచారణ జరిపింది. వారందరినీ మళ్లీ ప్రశ్నించింది. వివేకా పీఏతో సైతం మాట్లాడింది. దస్తగిరిని ప్రశ్నించింది. దర్యాప్తు సజావుగానే సాగిందని రూడీ చేసుకుంది. అవినాష్ అనుమానాలన్నీ అసంబద్ధమేనని తేల్చింది. మరోవైపు, వివేకా హత్య సమయంలో తాను జమ్మలమడుగు వెళ్తున్నానని.. విషయం తెలిసిన వెంటనే వచ్చేశానని చెప్పడంపైనా ఫ్యాక్ట్ చెక్ చేసుకుంది. అవినాష్ చెప్పింది నిజమే అయితే, ఆయనకు ఏ సమయంలో ఫోన్ వచ్చింది? అప్పుడు ఎక్కడ ఉన్నారు? తిరిగిరావడానికి ఎంత టైమ్ పడుతుంది? ఇలా స్పాట్‌కి వెళ్లి ప్రాక్టికల్‌గా చెక్ చేసింది. ఇప్పుడు అదే విషయంపై ప్రశ్నించడానికే అవినాష్‌రెడ్డిని విచారణకు పిలిచారని అంటున్నారు. ఆయన చెప్పేవన్ని అబద్దాలని తేలితే.. దర్యాప్తునకు సహకరించడం లేదని భావిస్తే.. వివేకా హత్య కేసులో ఆయన పాత్రను నిర్థారించుకుంటే.. అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసినా చేయొచ్చని అంటున్నారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×