BigTV English

DK Shivakumar: నేను సింగిల్‌గానే.. డీకే రెబెల్ సిగ్నల్!.. హ్యాండిస్తారా?

DK Shivakumar: నేను సింగిల్‌గానే.. డీకే రెబెల్ సిగ్నల్!.. హ్యాండిస్తారా?
dk shivakumar

DK Shivakumar: “135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా. పార్టీని ఏకం చేశా. నేను ఒంటరిని, ఒంటరిగానే పార్టీని గెలుపించుకున్నా. నా మద్ధతు దారుల సంఖ్య ఇప్పుడు చెప్పను”.. ఇవీ డీకే శివకుమార్ లేటెస్ట్‌గా చేసిన కామెంట్స్. తన మద్దతు దారులతో భేటీ తర్వాత ఇలా మాట్లాడటం మరింత ఆసక్తి రేపుతోంది. కర్నాటక సీఎం కుర్చీ కోసం డీకే.. వాయిస్ పెంచినట్టుంది.


సీఎం ఎంపికపై ఓ కమిటీని వేసింది అధిష్టానం. ఆ కమిటీ ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయం తీసుకుంటోంది. అటు, సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తున్నారు. ఇదే డీకేను కలవరానికి గురి చేస్తున్న అంశం. ఎందుకంటే, మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే సపోర్ట్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటినుంచీ డీకే.. పార్టీలో తనకంటూ ప్రత్యేక వర్గాన్నేమీ మెయిన్‌టెన్ చేయలేదు. అందులోనూ శివకుమార్ కాస్త సీరియస్‌గా ఉంటారని.. అందరితో కలిసిపోరనే టాక్ ఉంది. అయితే, పీసీసీ చీఫ్ అయ్యాక ఆయన ధోరణి మారింది. పార్టీ నేతల్లో ఐకమత్యం తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అయినా, ఆయనకంటూ ఓ వర్గం లేకుండా పోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటు కోసం.. హెడ్ కంట్ చేస్తుండటం డీకేకు పరిస్థితి ప్రతికూలంగా మారే అవకాశం ఉందంటున్నారు.

అందుకే, ఇలాగైతే పదవి రాదనుకున్నారో ఏమో.. పీసీసీ చీఫ్‌గా ఉండి పార్టీని గెలిపించా.. కాబట్టి సీఎం సీటు తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నేను ఒంటరిని, ఒంటరిగానే పార్టీని గెలిపించుకున్నా.. అనడంలోనూ ఆయన ఉద్దేశం అదేనంటున్నారు. నా మద్దతు దారుల సంఖ్య ఇప్పుడు చెప్పను.. అన్నారంటే నెంబర్ గేమ్‌లో తాను ముందుండననే విషయం ఆయనకు తెలిసే ఉంటుంది. అందుకే, ఆ లెక్కలన్నీ పక్కనపెట్టి.. తనకే సీఎం పోస్టు ఇవ్వాలనేది డీకే డిమాండ్. అందుకే, ఢిల్లీ కూడా వెళ్లకుండా.. బెంగళూరులోనే ఉండి మంత్రాంగం నడుపుతున్నారు.


కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిని హైకమాండ్ డిసైడ్ చేస్తుందని చెప్తూనే.. ఆ కుర్చీపై కర్చీఫ్ వేస్తున్నారు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన బర్త్‌డే వేడుకల్లో సైతం సిద్ధు పాల్గొన్నారని గుర్తు చేశారు. సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గేలు సీఎం అభ్యర్థిపై సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పి.. పరోక్షంగా బ్లాక్‌మెయిల్‌కు దిగారంటున్నారు. మరి, డీకే, సిద్ధరామయ్యల ఆధిపత్యపోరును అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది? సీఎం కిరీటం ఎవరికి కట్టబెడుతుంది? ఇద్దరిలో ఒకరిని సీఎం చేస్తే.. ఇంకొకరు సహకరిస్తారా? సహాయ నిరాకరణ చేస్తారా? పదవీకాలం చెరిసగం పంచుకుంటారా? ఇలా కర్నాటకం ఎన్నికల తర్వాతే మరింత రంజుగా కనిపిస్తోంది.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×