Jagan on Pulivendula: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలో వైసీపీ ఓటమి ఖాయమని మాజీ సీఎం జగన్‌కు తెలిసిపోయిందా? అందుకే మీడియా ముందుకొచ్చారా? పులివెందులలో జరిగింది ఎన్నిక కాదని ఎందుకున్నారు? అంత దారుణంగా ఓటమి పాలవుతున్నారా? మళ్లీ ఎన్నికలు జరిపించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
పులివెందుల-ఒంటిమిట్ట జెడ్పీ ఉప ఎన్నిక ద్వారా జగన్‌కు ఊహించని షాక్ తగులుతుందా? అందుకే బుధవారం ఉదయం మీడియా ముందుకొచ్చారా? ముఖ్యనేతలు ఓటమిని అంగీకరించకుండా ఇలాంటి సాకులు చెప్పడం సహజంగా జరుగుతుంది.
మూడు దశాబ్దాల తర్వాత పులివెందుల కోటలో పసుపు జెండా రెపరెపలాబోతోంది. దీన్ని వైసీపీ బాస్ తట్టుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీలో పాగా వేయాలని ఆలోచన చేస్తోంది కూటమి. అదే జరిగితే మాజీ సీఎం తట్టుకుంటారా? అన్నది అసలు ప్రశ్న.
ఏపీలో ప్రజాస్వామ్యం కనిపించలేదని, చరిత్రలో ఈ స్థాయిలో హింస జరగలేదన్నారు. బందిపోటు దొంగల తరహాలో చంద్రబాబు ఎన్నిక జరిపించారన్నది ప్రధాన ఆరోపణ. చంబల్ లోయ బందిపోట్లను మరిపించేలా ఎల్లో బ్యాచ్ ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడిందని ఘాటుగా విమర్శించారు. పాలనపై నమ్మకం ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా కేంద్ర బలగాలతో ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేశారు.
ALSO READ: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త జీవో వివరాలేంటి?
బూత్‌ల్లో వైసీపీ ఏజెంట్ లేకుండా ఎన్నిక జరగడం ఇదే తొలిసారని ఆందోళన వ్యక్తం చేశారు జగన్. పార్టీకి సంబంధించిన ఏజెంట్ బూత్ దగ్గరికే వెళ్లలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని, పోలీసుల సమక్షంలో రిగ్గింగ్ జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యం ఏమాత్రం లేదన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా జరిగిన దాడులు అందుకు నిదర్శనమన్నారు. పచ్చ చొక్కా వేసుకున్న పోలీసులు.. 700 మందిని బయటి నుంచి టీడీపీ నేతలు, వాళ్ల వర్గీయులను పులివెందులలో మోహరించారని అన్నారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రొత్సహించారన్నది ప్రధాన విమర్శ.
పోలింగ్ బూత్‌లను ఇష్టానుసారంగా మార్చేశారంటూ ఆరోపించారు జగన్. పోలింగ్ బూత్ ఆవరణలో సీసీటీవీ ఫుటేజీలు ఇచ్చే ధైర్యముందా? అని ప్రశ్నించారు. ప్రతి బూత్‌లో వెబ్ కాస్టింగ్ దృశ్యాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పులివెందులలో జరిగింది ఎన్నిక కాదని అంటున్నారు వైసీపీ అధినేత.
బూత్‌ల్లో వైసీపీ ఏజెంట్ లేకుండా ఎన్నిక జరగడం ఇదే తొలిసారి: జగన్
పార్టీకి సంబంధించిన ఏజెంట్ బూత్ దగ్గరికే వెళ్లలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది
సాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే ఎన్నికల రిగ్గింగ్ జరిగింది
– మాజీ సీఎం వైఎస్ జగన్ pic.twitter.com/zUcvS2pRuN
— BIG TV Breaking News (@bigtvtelugu) August 13, 2025