మనం రోజూ స్నానం చేస్తాం. స్నానం చేసేప్పుడు శరీరానికి సోపు తప్పకుండా వాడుతాం. అయితే ఆ సోపులో TFM అంటే Total Fatty Matter అనే పదార్థం ఉంటుందని ఎంతమందికి తెలుసు? ఇది సోపులో ఉన్న సహజ కొవ్వు పదార్థాల మోతాదును సూచిస్తుంది. ఈ TFM చర్మానికి మేలు చేస్తుందా? లేక హాని చేస్తుందా? అనేది దాని శాతం మీద ఆధారపడి ఉంటుంది. ఈ TFM అనేది సోపులో ఉండే కొవ్వు మోతాదును సూచిస్తుంది. అంటే, సోపు లో ఎన్ని శాతం సహజ కొవ్వు పదార్థాలు ఉన్నాయో అది TFM ద్వారా అర్థం చేసుకోవచ్చు. TFM ఎక్కువైతే ఆ సోపు నాణ్యత మంచిదని చెప్పవచ్చు. అందుకే, మంచి సోపు అంటే ఎక్కువ TFM కలిగి ఉండాలి.
కానీ మార్కెట్లో కొన్ని సోపులు చాలా తక్కువ TFM కలిగి ఉంటాయి. అంటే వాటిలో సహజ కొవ్వు తక్కువగా ఉంటుంది. వాటిని తయారు చేసేందుకు చాలా రసాయనాలు, కెమికల్స్ ని వాడతారు. ఈ రసాయనాలు మన చర్మానికి హానికరం అవుతాయి. ఎందుకంటే, చర్మం సహజంగా తైలం (sebaceous glands) వలన రక్షణ పొందుతుంది. కానీ తక్కువ TFM ఉన్న సోపు వాడటం వల్ల ఆ సహజ తైలాలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం పొడిగా మారుతుంది, చర్మంలో ఊబ్బరం, ఎర్రదనం, పొడిపోడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంకా, తక్కువ TFM ఉన్న సోపులు ఎక్కువ కాలం వాడితే, చర్మం పై రసాయనాల ప్రభావం పెరిగి, అలర్జీలు రావచ్చు. చర్మం దురదగా మారి ముడతలు రావడం కూడా సహజమే. ఈ రకమైన సోపులు చర్మంలో ముడతలు, దురద పడే సమస్యలకు దారి తీస్తాయి. ముఖ్యంగా సున్నిత చర్మం ఉన్నవారి కి ఇది మరింత ప్రమాదకరం. కాబట్టి, చర్మానికి హానికరంగా ఉండే సోపులు ఎప్పుడు వాడకూడదు. మీరు కొనుక్కునే సోపులో TFM విలువ ఎప్పుడూ పరిశీలించాలి. ఎక్కువ TFM ఉన్న సోపులు మాత్రమే వాడితే చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే, కనీసం 76% TFM ఉన్న మంచి నాణ్యమైన సోపునే ఎంచుకోవడం మంచిది
అలాగే, చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా ఉపయోగించాలి, అప్పుడు చర్మం తనలోని తేమను నిలుపుకుంటుంది, ఆ తేమ బయటికి ఆవిరైపోకుండా కాపాడుకుంటుంది. దీని వల్ల చర్మం పొడిగా కాకుండా మృదువుగా, సాఫ్ట్‌గా ఉంటుంది. మొత్తానికి, TFM తక్కువగా ఉన్న సోపులు మన చర్మానికి నష్టాలను కలిగిస్తాయి. అందువల్ల, మనం ఎప్పుడూ మంచి నాణ్యత గల TFM ఎక్కువ ఉన్న సోపులను వాడి, చర్మాన్ని రక్షించుకోవాలి. ఇది మీ చర్మ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. సోపు వాడే సమయంలో ఈ విషయాలను తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి. ఇలా జాగ్రత్తగా ఉంటే చర్మ సమస్యలు దూరంగా ఉంటాయి.