Hyderabad News: హైదరాబాద్ లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. యాకుత్ పురాలో గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లి ఓ వ్యక్తి నాలాలో పడ్డాడు.. అయితే అక్కడి స్థానికులు గమనించడంతో క్షణాల్లో బయటపడ్డాడు. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. భారీగా వరద నీరు నాలాల్లో వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోని ఓ వ్యక్తి నాలాలో పడి క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లి నాలాలో పడిపోయిన వ్యక్తి
నాలా ఉధృతకు కొట్టుకుపోతుండగా కాపాడిన స్థానిక కార్పొరేటర్
హైదరాబాద్ పాతబస్తీ యాకుత్ పురా వద్ద ఘటన
నిచ్చెన, తాడు సహాయంతో నాలాలో పడిపోయిన గౌస్ అనే వ్యక్తిని రక్షించిన స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ pic.twitter.com/Jbo8dizuqT
— BIG TV Breaking News (@bigtvtelugu) August 13, 2025
అయితే.. యాకుత్ పురాకు చెందిన ఓ వ్యక్తి గొర్రెలకు ఆహారం కోసం ఆకులు తెంపడానికి వెళ్లి నాలాలో పడ్డాడు. ప్రమాదవశాత్తూ కాలు జారిపడి గౌస్ ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో పడిపోయాడు. అయితే వరద, ముురుగు నీరు బీభత్సంగా ప్రవహిస్తుండడంతో అక్కడ బండను పట్టుకుని ఆగిపోయాడు. ఈ ఘటనకు అక్కడి స్థానికులు గమనించారు. నిచ్చెన సాయంతో ఆ వ్యక్తిని బయటకు తీశారు. దీంతో గౌస్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు గమనించడం ఆలస్యమైనా మురుగు నీరు ప్రవహిస్తున్న నాలాలో కొట్టుకుపోయేవాడు. బాధిత వ్యక్తిని కాపాడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ: Weather News: అత్యంత భారీ వర్షాలు.. డేంజర్ జోన్‌లో ఈ జిల్లాలు.. బయటకు వెళ్లొద్దు
గత వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే వర్షాలు దంచికొడుతున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు నగరవాసులు, ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి భాగ్యనగరంలో పలు చోట్ల వర్షం దంచికొడుతోంది.
ALSO READ: Heavy rain alert: 48 గంటల పాటు దంచుడే.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!
భారీ వర్షాల నేపథ్యంలో భాగ్యనగర వాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు అయితే ట్రాఫిక్ లో చిక్కుకుని గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అక్కడక్కడ పిడుగులు కూడా అవకాశం ఉంది.. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. అందుకే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు భాగ్యనగర వాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను అప్డేట్ చేస్తున్నారు.