Weather News: గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే వర్షాలు దంచికొడుతున్నాయి. సాయంత్రం, రాత్రివేళల్లో నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు నగరవాసులు, ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు అయితే ట్రాఫిక్ లో చిక్కుకుని గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. అందుకే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు భాగ్యనగర వాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను అప్డేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది.
రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు
ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
9 జిల్లాలకు రెడ్ అలర్ట్.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వాతావరణ శాఖ తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్ – మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్ , జనగామ, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రెడ్ అలర్ట్ జిల్లాలు ఇవే..
సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్ – మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు ఇవే..
హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్ , జనగామ, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్
ఎల్లో అలర్ట్ జిల్లాలు
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్
భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్, ఆరెంజ్ ఆలర్ట్, ఎల్లో అలర్ట్ గల జారీ చేసిన జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నదులు, వాగులు పొంగి పొర్లే అవకాశం ఉండడంతో గ్రామాల్లో భారీ వరదలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Heavy rain alert: 48 గంటల పాటు దంచుడే.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!
ALSO READ: Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే