Grace Hayden on Pant: ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ నీ 2-2 తో ముగించిన భారత జట్టు స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెలలో భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ లో ఎటువంటి సిరీస్ లు లేవు. సెప్టెంబర్ లో ఆసియా కప్ ప్రారంభంతో టీం ఇండియా మళ్లీ వరుస మ్యాచ్ లతో బిజీబిజీగా మారనుంది. టి-20 ఫార్మాట్ లో జరగనున్న ఈ ఆసియా కప్ కి మరో రెండు వారాల్లో జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ టోర్నకి దూరం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Viral Video: 3 కొండల నడుమ క్రికెట్… కొంచెం అటు ఇటు అయినా ప్రాణం పోవాల్సిందే
నాలుగోవ టెస్ట్ తొలి రోజు ఆటలో భాగంగా పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్ లో మూడవ బంతిని.. పంత్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ కి తగిలి పంత్ కుడికాలు పాదానికి బలంగా తాకింది. దీంతో పంత్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో.. అనంతరం రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. అనంతరం గాయంతో మళ్లీ మైదానం లోకి అడుగుపెట్టి ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం పంత్ కి సర్జరీ అవసరం లేదని వైద్యులు సూచించారు. కానీ అతడు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
దీంతో అతడు ఆసియా కప్ కి దూరం కావలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రిషబ్ పంత్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురు కీలక వ్యాఖ్యలు చేసింది. రిషబ్ పంత్ గురించి ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ మ్యాథ్యూ హెడెన్ కుమార్తె గ్రేస్ హెడెన్ మాట్లాడుతూ.. ” రిషబ్ పంత్ పై నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. 2022 డిసెంబర్ లో జరిగిన యాక్సిడెంట్ తర్వాత పంత్ తొందరగా కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు అన్ని ఫార్మాట్ లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు టీమిండియాలోకి త్వరలోనే తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను. అతడు అంచలంచలుగా ఎదగడం నాకు ఎంతో ఇష్టం.
Also Read: Asia Cup 2025: ఆసియా కప్ కోసం డేంజర్ బౌలర్లను దించుతున్న టీమిండియా.. ఇక ప్రత్యర్ధులకు పీడ కలలే
పంత్ మోకాలి, చీలమండ, మణికట్టు, వెన్ను సమస్యలతో సహా అనేక తీవ్రమైన గాయాలకు గురయ్యాడు. వైద్యులు మొదట్లో అతడు కోలుకోవడానికి చాలాకాలం పడుతుందని అన్నారు. కానీ అతడు 15 నెలల్లోపు తిరిగి జట్టులో చేరాడు. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది అతని పూర్తి సంకల్పం, మానసిక దృఢత్వానికి నిదర్శనం. రిషబ్ పంత్ కి హాట్సాఫ్. అలాగే అతడు ఐపిఎల్ లో అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు. అతడు ఓ అసాధారణమైన వ్యక్తి. అతని పునరాగమనం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కదిలించింది. ఇప్పుడు కూడా త్వరగానే కోలుకొని మళ్ళీ జట్టులోకి తిరిగి వస్తాడని భావిస్తున్నాను.” అని పంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.