BigTV English

Telugu Film Chamber: ఫిలిం ఛాంబర్ లో మొదలైన మీటింగ్ , హాజరైంది వీళ్ళే 

Telugu Film Chamber: ఫిలిం ఛాంబర్ లో మొదలైన మీటింగ్ , హాజరైంది వీళ్ళే 

Telugu Film Chamber: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా షూటింగ్ లు కూడా జరగడం లేదు. దీని కారణం చాలామంది సినిమా కార్మికులు తమ వేతనాలను 30% వరకు పెంచాలి అని డిమాండ్ చేయడం. అయితే ఈ డిమాండ్ కు నిర్మాతలు ఒప్పుకోకపోవడం మధ్య ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు రేపు కొలిక్కి వస్తాయి అనుకునే సమస్యలు ఇప్పటివరకు క్లారిటీ లేకుండా పోయాయి.


దీని గురించి కొన్ని మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు సినిమా ప్రముఖ నిర్మాతలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ ను గెలిచిన విషయం తెలిసిందే. ఇక్కడ తెలంగాణలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా చాలామంది కలిశారు. మరోవైపు చిన్న సినిమాలు నిర్మించే నిర్మాతలం అంటూ ఎస్ కే ఎన్ కొంతమందితో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే దీని గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఫిలిం ఛాంబర్ లో మొదలైన మీటింగ్


కొద్దిసేపటికి ఫిలిం ఛాంబర్ లో సినీ కార్మికుల వేతనాలకు సంబంధించిన మీటింగ్ మొదలైంది. ఫిల్మ్ ఛాంబర్లో ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ నుంచి అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

ఫెడరేషన్ నుంచి కోఆర్డినేషన్ ఛైర్మెన్ వీరశంకర్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు..

అలానే నిర్మాతల నుంచి దిల్ రాజు, సి. కళ్యాణ్, భోగవల్లి బాపినీడు, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి సీఈఓ చెర్రీ, జెమిని కిరణ్, ఎస్.కె.న్, సుప్రియ యార్లగడ్డ, వివేక్ కూచికబోట్ల, స్రవంతి రవి కిషోర్, డైరెక్టర్ తేజ, వై వి ఎస్ చౌదరి, రామ సత్యనారాయణ

తదితరులు పాల్గొన్నారు. ఈ కార్మికుల వేతనాలకు సంబంధించిన అంశం గురించి నేడు క్లారిటీ వస్తుందో లేకుంటే ఇంకా ఈ పంచాయతీ పెరుగుతూనే ఉంటుందో కాసేపట్లో తెలుస్తుంది.

ఆగిపోయిన షూటింగులు 

ఇక పలుచోట్ల షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఒకవేళ సినిమా కార్మికులు షూటింగుకు హాజరైన కూడా లొకేషన్ కి వెళ్లి దాడి చేసే పరిస్థితి కూడా వచ్చేసింది. ఇప్పుడు షూటింగ్ లు ఆగిపోవడం వలన ఇప్పటికే సినిమా డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాలకు నష్టం కలుగుతుంది. ఎందుకంటే చెప్పిన డేట్ కి సినిమా రిలీజ్ చేయాలంటే అనుకున్న డేట్ కి సినిమా షూటింగ్ జరగాలి. ఇప్పుడు షూటింగ్ జరగట్లేదు కాబట్టి రిలీజ్ డేట్ లో వాయిదా పడే అవకాశం కూడా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు కొంతమేరకు గట్టెక్కినట్లే అని చెప్పాలి.

Also Read: Nidhhi Agerwal: డబ్బుల కోసమే నెగిటివిటీ చేస్తున్నారు, అసలు విషయం ఓపెన్ అయిన నిధి అగర్వాల్

Related News

Coolie: కూలీ మూవీ కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Chiyaan 65: విక్రమ్ కొత్త మూవీ.. అన్నీ సెట్ అయితే త్వరలోనే సెట్స్ పైకి!

Tollywood: నిర్మాతలతో ఫెడరేషన్‌ భేటీ.. మళ్లీ విఫలమైన చర్చలు.. సమ్మె కొనసాగింపు తప్పదా?

Rajinikanth: వచ్చి 50 ఏళ్ళు అయింది, క్రేజ్ చెక్కుచెదరలేదు 

Actress Sadha: సుప్రీం తీర్పు.. ప్లీజ్ అలా చేయొద్దంటూ బోరుమని ఏడ్చేసిన హీరోయిన్ సదా

Big Stories

×