BigTV English

Actress Sadha: సుప్రీం తీర్పు.. ప్లీజ్ అలా చేయొద్దంటూ బోరుమని ఏడ్చేసిన హీరోయిన్ సదా

Actress Sadha: సుప్రీం తీర్పు.. ప్లీజ్ అలా చేయొద్దంటూ బోరుమని ఏడ్చేసిన హీరోయిన్ సదా


Actress Sadha Emotional Video: హీరోయిన్సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. ప్రస్తుతం వెండితెరపై ఆమె సందడి కనిపంచడం లేదు. కానీ, ఒకప్పుడు ఆమె సౌత్లో టాప్హీరోయిన్‌. జయం, నాగ, అపరిచితుడు వంటి తదితర చిత్రాల్లో స్టార్హీరోల సరసన జతకట్టింది. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలు చేసిన ఆమెకు క్రమంలో అవకాశాలు తగ్గిపోయాయి. అయినా సదా సినిమా అవకాశాల కోసం చూడకుండ తనకు నచ్చిన ప్రొఫెషన్ఎంచుకుని హ్యాపీ లైఫ్లీడ్చేస్తుంది. సదా జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. అందుకే తనకు నచ్చిన వైల్డ్ఫోటోగ్రఫీని ఎంచుకుని ప్రొఫెషనల్ఫోటోగ్రాఫర్గా రాణిస్తోంది.

హీరోయిన్ నుంచి వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా..


ఆమె తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్మీడియాలో బాగా వైరల్అవుతున్నాయి. రేర్ సీన్స్‌, క్లిప్స్తన కెమెరాలో బంధించిన నెటిజన్లకు అందిస్తూ సర్ప్రైజ్చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సదా షాకింగ్వీడియో షేర్ చేసింది. తనకు ఏం తోచట్లేదని, బాధగా ఉందంటూ బోరున ఏడుస్తూ కనిపించింది. ఇంతకి సదా ఏడవడానికి కారణం ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పువీధి కుక్కలను బంధించి షెల్టర్లకు తరలించాలని రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశరాజధాని ఢిల్లోని అన్ని కుక్కలను 8 వారాల్లోగా షేల్టర్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.

అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై పలువురు సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభ్యంతరం తెలుపుతున్నారు. తాజాగా దీనిపై హీరోయిన్సదా కూడా సుప్రీం తీర్పుని వ్యతిరేకించింది. మేరకు ఆమె మాట్లాడుతూ తన ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్చేసింది. ఒక్క రేబిస్కేసు కోసం 3 లక్షల కుక్కలను సిటీనుంచి తరలిస్తారా? లేదా చంపేస్తారు. 8 వారాల్లో ప్రభుత్వం శనకాల కోసం షెల్టర్స్ ఎక్కడ? ఎలా సిద్ధం చేయగలరు. ఇది జరగని పని. వాటికి ఆశ్రయం కల్పించడం సాధ్యపడదు. కాబ్టటి చివరకు చంపేస్తారు. మున్సిపల్ఆఫీస్‌, ప్రభుత్వం వాటికి వ్యాక్సిన్వేయకుండ ఏం చేసింది.

Also Read: Annapurna Studio: అన్నపూర్ణ స్టూడియోకు 50 ఏళ్లు.. టాలీవుడ్‌ పునాది పడింది అప్పుడే.. ఇదీ ఏఎన్నార్ ఘనత

నాకేం చేయాలో తోచట్లేదు

ఏబీసి (యానిమల్బర్త్కంట్రోల్‌) ప్రోగ్రామ్కు ప్రత్యేక బడ్జెట్కేటాయించి ఉండుంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేదే కాదు. జంతుప్రేమికులు, ఎన్జీవోలు తమ పరిధిలో ఉన్న కుక్కలు,పిల్లుల సంఖ్య పెరగకుండ తమ శక్తిమేర ప్రయత్నం చేస్తున్నాయి. వాటి ఆరోగ్యం బాగోలేదంటే మా జేబులోంచి తీసి చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం మూగజీవాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం ఏలదు. వీధుల్లో శనకాలు ఉండకూడదన్న తీర్పు వచ్చేసింది. వాటి గురించి ఆలోచిస్తుంటే మనసు ముక్కలవుతుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరిని కలవాలి? ఎక్కడ నిరసన చేయాలి? ఏదీ తోచడం లేదు. కానీ, ఒకటి మాత్రం చెప్పగలను. తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. వాటిని చంపడం కరెక్ట్కాదు. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి తీర్పు వెనక్కి తీసుకోండిఅంటూ బోరున ఏడ్చేసింది.

Actress Sadha Gets Emotional on Stray Dogs Issues After Supreme Court Verdict

Related News

Coolie: కూలీ మూవీ కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Chiyaan 65: విక్రమ్ కొత్త మూవీ.. అన్నీ సెట్ అయితే త్వరలోనే సెట్స్ పైకి!

Tollywood: నిర్మాతలతో ఫెడరేషన్‌ భేటీ.. మళ్లీ విఫలమైన చర్చలు.. సమ్మె కొనసాగింపు తప్పదా?

Rajinikanth: వచ్చి 50 ఏళ్ళు అయింది, క్రేజ్ చెక్కుచెదరలేదు 

Telugu Film Chamber: ఫిలిం ఛాంబర్ లో మొదలైన మీటింగ్ , హాజరైంది వీళ్ళే 

Big Stories

×