Pulivendula Politics: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. పులివెందుల జెడ్పీ ఉప ఎన్నికపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రీపోలింగ్‌ను బాయ్ కాట్ చేస్తున్నామంటూ వైసీపీ చేసిన ప్రకటనపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి. బాయ్ కాట్ కాదు.. బావిలో పడి చావండని వ్యాఖ్యానించారు. ఏపీకి ఐపీ చేసిన ఘనత జగన్ సొంతం చేసుకున్నారని అన్నారు. పీఎం మోదీ సహకారంతో రాష్ట్రాన్ని వీఐపీ చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఉప ఎన్నికపై న్యాయపోరాటం చేస్తామంటే చేయాలని, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్లాలని వైసీపీకి సలహా ఇచ్చేశారు.
మరోవైపు పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి నోరు విప్పారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఓడిపోతామని తెలిసి వైసీపీ లేనిపోని సాకులు చెబుతోందని దుయ్యబట్టారు. తొలుత రీపోలింగ్ డిమాండ్ చేసిన వైసీపీ, మళ్లీ బహిష్కరిస్తున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పడం సరికాదన్నారు. మొత్తం 15 బూతుల్లో రీపోలింగ్ నిర్వాహించాలని మళ్లీ డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు.
ఓటమిని అంగీకరించలేక వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కి దిగిందన్నారు మంత్రి సవిత. జనాలు ఓటు వేయలేదని గ్రహించే జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి రీపోలింగ్ కోరారని తెలిపారు. వాళ్లే రీపోలింగ్ అడిగి మళ్లీ ఇప్పుడు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ప్రజలే మిమ్మల్ని బహిష్కరించారనే విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
ALSO READ: జగన్ ప్రెస్‌మీట్.. పుటేజ్ బయటపెడతారా? ఓటమిని అంగీకరించినట్టేనా?
రీపోలింగ్ పై వైసీపీ చేసిన డిమాండ్ ఏంటి? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అవకతవకలు జరిగాయని ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. ఈ నేపథ్యంలో రెండు బూత్ ల్లో బుధవారం రీపోలింగ్ ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రీపోలింగ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. కంటితుడుపు చర్యగా రీపోలింగ్ నిర్వహిస్తున్నారని, పులివెందులలో కొత్త సంస్కృతిని సీఎం చంద్రబాబు తెచ్చారని మండిపడ్డారు. చివరకు కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలన్నది వైసీపీ డిమాండ్. మొత్తానికి వైసీపీ చేస్తున్న డ్రామాలను కూటమి నేతలు గమనిస్తున్నారు.
బాయ్ కాట్ కాదు.. బావిలో పడి చావండి: ఆదినారాయణరెడ్డి
ఏపీని ఐపీ చేసిన ఘనత జగన్ దైతే మోదీ సహకారంతో రాష్ట్రాన్ని వీఐపీ చేస్తున్న ఘనత చంద్రబాబుది
– ఆది నారాయణ రెడ్డి pic.twitter.com/o1feMAiwUe
— BIG TV Breaking News (@bigtvtelugu) August 13, 2025
జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగింది: బీటెక్ రవి
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది
ఎలాగో ఓడిపోతామని తెలిసి వైసీపీ లేనిపోని సాకులు చెబుతోంది
రీపోలింగ్ అడిగి, మళ్లీ ఇప్పుడు బహిష్కరిస్తున్నట్లు అవినాష్ రెడ్డి చెప్పడం సరికాదు
– పులివెందుల… pic.twitter.com/HLheY1PBpR
— BIG TV Breaking News (@bigtvtelugu) August 13, 2025