BigTV English

Chandrababu Health Update : చంద్రబాబుకు వరుస అనారోగ్య సమస్యలు.. వైద్యులు ఏమన్నారంటే ?

Chandrababu Health Update : చంద్రబాబుకు వరుస అనారోగ్య సమస్యలు.. వైద్యులు ఏమన్నారంటే ?

Chandrababu Health Update : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు రోజుకో ఆరోగ్య సమస్య వచ్చి పడుతోంది. మొన్నటికి మొన్న డీహైడ్రేషన్ సమస్యతో బాధపడ్డ చంద్రబాబు.. తాజాగా స్కిన్ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారు. స్కిన్ అలర్జీ గురించి జైలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రభుత్వ స్కిన్ డాక్టర్ ను వైద్యం నిమిత్తం అధికారులు జైలు లోపలికి అనుమతించారు. జైల్లో స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రతిరోజు చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు బీపీ, షుగర్, టెంపరేచర్, హార్ట్ బీట్, ఫిజికల్ పరీక్షలు అన్నీ నార్మల్ గానే ఉన్నాయని హెల్త్ బులిటెన్‌లో తెలిపారు.


చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని..ఎటువంటి అపోహలకు గురికావొద్దని అధికారులు సూచించారు. బీపీ 140/80, పల్స్ రేట్ 87 ఉండగా.. టెంపరేచర్ నార్మల్ గానే ఉందన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై వారం రోజుల పాటు ప్రతిరోజు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు. స్కిన్ ఎలర్జీ ఉందని తెలిసిన వెంటనే జైలు అధికారులు స్పందించారని..స్కిన్ స్పెషలిస్టును పంపాలని..చాలా అత్యవసరం..వెంటనే వైద్యులను పంపాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు జైలు సూపరింటెండెంట్ లేఖ రాసినట్లు అధికారులు వెల్లడించారు.

గత కొన్నేళ్లుగా చంద్రబాబు చర్మ సంబంధ సమస్యలతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆ సమస్య ఎక్కువకాడం..దానికి తోడు వాతావరణం మార్పులతో డీహైడ్రేషన్‌కు కూడా గురయ్యారవడంతో.. జైల్లోనే ఉన్న వైద్యులు చంద్రబాబుకి చికిత్స అందించారు. జైల్లో వైద్యం చేస్తున్నా స్కిల్ అలర్జీ ఎక్కువ కావడంతో ప్రత్యేక వైద్య నిపుణులను పిలిపించామని తెలిపారు జైలు అధికారులు. జీజీహెచ్ నుంచి జైలుకి వెళ్లిన డెర్మటాలజిస్టుల బృందం.. జైల్లో చంద్రబాబుకి చికిత్స అందిస్తోంది.


చంద్రబాబుని టెస్ట్ చేసిన స్కిన్ స్పెషలిస్టులు కొన్ని సూచనలు చేశారు. చంద్రబాబు ముఖం, చేతి మీద దద్దుర్లు.. కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉందని తెలిపారు. నేడు మరోసారి చర్మ వ్యాధి నిపుణులు చంద్రబాబుకి టెస్టులు చేయనున్నారు. ఇన్ ఫెక్షన్ మరింత పెరిగితే..చంద్రబాబును ఆస్పత్రికి కూడా తరలించే అవకాశం కనిపిస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో గత 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు.. వాతావరణ పరిస్థితులు, ఎండ తీవ్రత కారణంగా స్కిన్ అలర్జీ ఎక్కువైనట్లు చెబుతున్నారు వైద్యులు. ట్రీట్ మెంట్ అందించినప్పటికీ ఇన్ ఫెక్షన్ మాత్రం కొంత అలానే ఉందని వైద్యులు తెలిపారు. ఇవాళ మరోసారి వైద్య పరీక్షల అనంతరం మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు అధికారులు.

Related News

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Big Stories

×