E-Paper
Advertisement

Ex MLA Pinnelli: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. కంటతడి పెట్టిన కొడుకు.. నేరుగా అక్కడికి..

Ex MLA Pinnelli: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. కంటతడి పెట్టిన కొడుకు.. నేరుగా అక్కడికి..
Advertisement

Ex MLA Pinnelli: దాదాపు రెండు నెలల తర్వాత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. నెల్లూరు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో పిన్నెల్లి కొడుకు కంటతడి పెట్టాడు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం డ్యామేజ్ వ్యవహారంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు న్యాయస్థానం జోక్యంతో పోలీసులకు లొంగిపోయారు. దీంతో పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు.

Advertisement

బెయిల్‌పై బయటకు వచ్చేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేశారాయన. శుక్రవారం న్యాయస్థానం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ప్రత్యేక వాహనంలో ఆయన బయలుదేరారు. పాస్‌పోర్టును పోలీస్‌స్టేషన్‌లో స్వాధీనం చేయనున్నారు. నెల్లూరు నుంచి నేరుగా నరసరావుపేటకు వెళ్లనున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

ALSO READ: కౌలాలంపూర్‌లో కుప్పం మహిళ గల్లంతు, నడుస్తుండగా..

Advertisement

రెండురోజులు నరసారావుపేటలో విశ్రాంతి తీసుకున్న తర్వాత మాచర్లకు వెళ్లనున్నారు పిన్నెల్లి. నరసారావుపేట, మాచర్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకున్నారు పోలీసు అధికారులు. ఎన్నికల ఫలితాల తర్వాత సొంతూరు వస్తుండడంతో ఏం జరుగుతుందోనని చర్చించుకుంటున్నారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇన్నాళ్లు మాదిరిగా దూకుడుగా వ్యవహరించలేరన్నది వైసీపీ నేతల మాట. గతంలో ఉన్న అధికారులను వేరే ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్స్ చేశారు. 20 ఏళ్ల తర్వాత టీడీపీ గెలిచింది.  ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉందని, ఈ లెక్కన పిన్నెల్లి సైలెంట్‌గా ఉంటారని చెబుతున్నారు. పిన్నెల్లి జైలుకి వెళ్లిన తర్వాత ఎలాంటి ఘటనలు మాచర్లలో జరగలేదని అంటున్నారు.

 

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×