E-Paper
Advertisement

Makara Sankranti-2026: మకర సంక్రాంతి నేడు.. కళకళలాడుతున్న పల్లెటూర్లు, నేతల శుభాకాంక్షలు

Makara Sankranti-2026: మకర సంక్రాంతి నేడు.. కళకళలాడుతున్న పల్లెటూర్లు, నేతల శుభాకాంక్షలు
Advertisement

Makara Sankranti-2026: మరక సంక్రాంతి పండుగ విశిష్టత అంతా ఇంతా కాదు. సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజును మరక సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు, అలాగే మకర సంక్రాంతి రోజు ప్రచండ తేజస్సుతో ప్రకాశిస్తాడు. సంక్రాంతి మూడు రోజుల పండుగలో అతి ముఖ్యమైనది ఇది.

దేశవ్యాప్తంగా ఇవాళ మకర సంక్రాంతి

Advertisement

ఒక్కమాటలో చెప్పాలంటే సంస్కృతీ సంప్రదాయాలకు వేదిక. భోగభాగ్యాలు, సిరి సంపదలను కురిపిస్తూ కొత్తకాంతులను విరజిమ్ముతాయి. పాడిపంటలతో పల్లె సీమలు కళకళలాడుతాయి. ఏడాదంతా కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయం కూడా ఇదే. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల సంకీర్తనలు, కొత్త అల్లుళ్ళ పల్లెలు, పట్టణాలు సందడిగా మారే రోజు. చిన్నారులకు గాలి పటాల పండుగ. దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణం ప్రవేశించే గడియలు కావడంతో ‘ఉత్తర క్రాంతి’గా పిలుచుకుంటారు.

సంక్రాంతి రోజున నిద్ర లేచి తల స్నానం చేయాలి. ఆ తర్వాత పూజలు చేస్తారు. రవి సంక్రమణ సమయంలో పితృ దేవతలకు తర్పణాలు, దానాలు చేస్తారు. ఇది ఆచార వ్యవహారాల్లో ఒక భాగం కూడా. మరక సంక్రాంతి రోజు చేసే దానాలకు అనేక రెట్లు పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం. పెద్ద పండుగ రోజున రకరకాల నిత్యావసర వస్తువులను దానం చేస్తారు.

Advertisement

కళకళలాడుతున్న పల్లెటూర్లు, నేతల శుభాకాంక్షలు

దానివల్ల ఆ ఇంట శుభ ఫలితాలు వస్తాయని చెబుతారు. పితృ దేవతారాధన చేయడం వల్ల వారి ఆశీస్సులు లభించి అన్నింటా శుభాలు కలుగుతాయి. కొత్త దుస్తులు ధరించి సూర్య భగవానుడుని స్మరించుకోవాలి. పితృదేవతలకు ఆరాధన చేసినప్పుడు దేవుడికి పూజ చేస్తారు. నూతన వస్త్రాలు, పిండి వంటలను ముందు పెడతారు. పూజ తర్వాత ఇంట్లో పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. బూరెలు, గారెలు, అరిసెలు, జంతికలు, పులిహోర వంటి రకరకాల పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి భోజనం

కొత్త కుండలో పాలు పొంగిస్తారు. అందులో కొత్త బియ్యం, బెల్లంతో పొంగలి వండుతారు కూడా.  దేశవ్యాప్తంగా మకర సంక్రాంతిని చేసుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో ఆ పండుగ చేస్తుంటారు అక్కడి ప్రజలు. ఏపీలో పెద్ద పండుగ, తమిళనాడులో పొంగల్, కేరళలో మకర వలిక్కు, ఒడిషాలో మరక సంక్రాంతి, బెంగాల్ లో పుష్ సంక్రాంతి, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్‌ల్లో మరక సంక్రాంతి పేరుతో చేస్తారు. గుజరాత్, రాజస్థాన్ ల్లో ఉత్తరాయణ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో లోహ్రి వంటి పేర్లుతో ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు.

ALSO READ: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×