E-Paper
Advertisement

Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు.. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కేసు నమోదు

Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారంలో కీలక మలుపు.. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కేసు నమోదు
Advertisement

అనంతపురంలో గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ఎగ్జిబిషన్ వివాదం కీలక మలుపు తిరిగింది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రధాన అనుచరులతో పాటు ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వేగంగా చర్యలు చేపట్టారు.

అసలేం జరిగింది?

Advertisement

అనంతపురంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే అనుచరులకు, నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌కు మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఫక్రుద్దీన్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. ఫోర్త్ టౌన్ పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు.

ఎమ్మెల్యే అనుచరులపై కఠిన సెక్షన్లు

Advertisement

ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌పై దాడి చేసిన వ్యవహారంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు గంగారాంను ఏ-1 (A1) గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. గంగారాంతో పాటు మరికొంతమంది అనుచరులపై కూడా FIR ఫైల్ అయ్యింది. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం 308(3), 351(2), 329(3), 118(1) r/w 3(5) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ సెక్షన్లు తీవ్రమైన నేరాలకు సంబంధించినవి కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. ప్రస్తుతం గంగారాం సహా మిగతా నిందితులు పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.

నిర్వాహకుడిపై కూడా కేసు

కేవలం ఎమ్మెల్యే అనుచరులపైనే కాకుండా, ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అనుచరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫక్రుద్దీన్‌పై 115(2), 351(2) సెక్షన్ల కింద కేసు ఫైల్ అయ్యింది. ఇరు వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

సీఎం సీరియస్.. పోలీసుల తనిఖీలు

రాష్ట్రంలో రౌడీయిజం, దౌర్జన్యాలను సహించబోమని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్పష్టమైన ఆదేశాలు అందడంతో అనంతపురం పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి అనుచరులపైనే కేసులు నమోదు కావడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనతో నగరంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ALSO READ: Kishan Reddy: ఆ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే వారిని విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×