E-Paper
Advertisement

Minister Durgesh: ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రండి: మంత్రి కందుల దుర్గేష్

Minister Durgesh: ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రండి: మంత్రి కందుల దుర్గేష్
Advertisement

Minister Kandula Durgesh: ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ చిత్ర పరిశ్రమ ప్రముఖులను కోరారు. గురువారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

కోనసీమలో మూవీ షూటింగ్స్ పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. పర్యాటక రంగం ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. అధికారిక యంత్రాంగంతో కలిసి రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తామని అన్నారు.

Advertisement

Also Read: జనంలోకి జగన్.. ఓదార్పు యాత్రకు రెడీ ?

పర్యాటక ప్రాంతాలుగా ఉండాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అదృష్టవశాత్తు ప్రజలు వైసీపీకి బుద్ది చెప్పారని అన్నారు. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకుని నిధులు సమకూర్చుకుని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీలో స్టూడియో నిర్మాణం కోసం ముందుకు రావాలని ఆహ్వానం పలికారు. గత పాలకులకు చిత్తశుద్ది ఉంటే కేరళ తరహాలో కోనసీమను అభివృద్ధి చేసేవారని చెప్పారు. రూ. 2 కోట్ల 31 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న బోట్ షికార్ ఫైల్‌పై మంత్రి మొదటి సంతకం చేశారు.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×