BigTV English

Kurnool: అమ్మాయి నగ్న వీడియోలు లీక్.. యువకుడి దారుణ హత్య

Kurnool: అమ్మాయి నగ్న వీడియోలు లీక్.. యువకుడి దారుణ హత్య

Kurnool: అమ్మాయిల నగ్నవీడియోలను చిత్రీకరించడం.. డబ్బులు ఇవ్వాలంటూ వేధించడం.. బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం.. ఇటువంటి దారుణమైన ఘటనలు నిత్యం ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. ఇలానే ఓ యువకుడు తన స్నేహితుడి లవర్ నగ్న వీడియోలను సంపాదించి.. వాటితో ఆ అమ్మాయిని వేధించడం మొదలు పెట్టాడు. చివరికి తన స్నేహితుని చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కర్నూలులో జరిగింది. జనవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


కర్నూలుకు చెందిన దినేశ్ అనే యువకుడు తన ప్రియురాలి నగ్న వీడియోలు, ఫొటోలను తన ఫోన్‌లో సేవ్ చేసుకున్నాడు. అయితే అతని స్నేహితుడు మురళీకృష్ణ దినేశ్‌కు తెలియకుండా వీడియోలను, ఫొటోలను సీక్రెట్‌గా తన ఫోన్‌లోకి కాపీ చేసుకున్నాడు. ఆ తర్వాత సదరు అమ్మాయికి ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టాడు. డబ్బులు పంపించాలని.. లేదంటే ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు.

అతని వేధింపులు తాళలేక ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చేరింది. ఈక్రమంలో దినేశ్, మురళీకృష్ణపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. అతని స్నేహితుడు కిరణ్‌కుమార్‌తో కలిసి పథకం పన్నాడు. జనవరి 25న ఇద్దరూ కలిసి శివమాలలో ఉన్న మురళీకృష్ణను బైకుపై నగర శివారుకు తీసుకెళ్లారు.


అక్కడ తమ వెంట తెచ్చుకున్న కత్తితో మురళీకృష్ణను దారుణంగా పొడిచి హత్య చేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మురళీకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ సంచిలో ఉంచి నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని హెచ్ఎన్ఎన్ఎన్ కాలువలో పడేశారు. ఆనవాళ్లు దొరకకుండా అతని ఫోన్, బట్టలను వేరువేరు చోట్ల పడేశారు.

కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన మురళీకృష్ణ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనుమానం వచ్చి దినేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసులు విషయం బయటపడింది. మృతదేహం కోసం పోలీసులు హెచ్ఎన్ఎన్ఎన్ కాలువలో గాలిస్తున్నారు. దినేశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Related News

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Big Stories

×