BigTV English

RC15: RC 15.. కియారా అద్వానీ షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌

RC15: RC 15.. కియారా అద్వానీ షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌

RC 15:బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. ఇప్ప‌టికే రెండు భారీ చిత్రాల్లో ఆమె న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మూడో చిత్రంగా RC 15లో న‌టిస్తోంది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే సినిమా 70 శాతానికి పైగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కియారా అద్వానీ పాత్ర‌కు సంబంధించి కొంత మేర చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌య్యింది. ఇంకా కొన్ని రోజులు మాత్ర‌మే ఆమె షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.


అయితే RC 15కోసం కియారా అద్వానీ ఎంత రెమ్యూన‌రేష‌న్ తీసుకుంద‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మూవీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు కియారా అద్వానీ RC 15 కోసం రూ.4 కోట్లు డిమాండ్ చేసిందట‌. అయిఏత RC 15ను పాన్ ఇండియా రేంజ్ మూవీగా తెర‌కెక్కిస్తుండ‌టం.. కియార వంటి హీరోయిన్ ఉంటే బాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉంటుంద‌నే ఉద్దేశంతో మేక‌ర్స్ ఆమె అడిగినంత మొత్తాన్ని ఇవ్వ‌టానికి రెడీ అయ్యారు.

ప్ర‌స్తుతం సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను వివాహం చేసుకున్న కియారా అద్వానీ ..వెడ్డింగ్ మూడ్‌లోనే ఉంది. త్వ‌ర‌లోనే ఆమె మ‌ళ్లీ షూటింగ్స్‌లో పాల్గొన‌బోతుంది. రామ్ చ‌ర‌ణ్‌తో ఆమె న‌టించ‌టం ఇదేమీ తొలిసారి కాదు.. ఇంత‌కు ముందు విన‌య విధేయ రామ చిత్రంలోనూ చెర్రీతో జోడీ క‌ట్టిందీ బాలీవుడ్ బ్యూటీ.


RC 15 విష‌యానికి వ‌స్తే ఇదొక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌. ఇందులో రామ్ చ‌ర‌ణ్ రెండు పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఓ పాత్ర‌లో రాజకీయ నాయ‌కుడిగా, మ‌రో రోల్‌లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించే ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Ram Charan: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. రీరిలీజ్‌కు రెడీ అవుతున్న ‘మగధీర’..

Salaar: ‘సలార్’కి శ్రుతి హాసన్ బై బై

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×