E-Paper
Advertisement

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

ఇష్టం వ‌చ్చిన‌ట్టు విమ‌ర్శిస్తే తొక్కిప‌ట్టి నార‌తీస్తామ‌ని వైసీపీ నేత‌లు కొడాలి నాని, రోజాల‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. విమర్శించే ప్రతిఒక్కరికీ ఒకే మాట చెబుతున్నా ఇష్టానుసారంగా వ్యహరిస్తాం..సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కుటుంబ సభ్యులను తిడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెత్తటి ప్రభుత్వం కాదని అన్నారు. తాను ఇప్పటి వరకు ఏమీ అనలేదని కానీ జోలికి వస్తే ఊరుకోనని అన్నారు. పవన్ కల్యాణ్ నేడు జగన్నాథ‌పురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యుద్ద‌మే కావాలంటే కావాల్సినంత యుద్దం చేస్తామ‌ని అన్నారు.

గొడ‌వలే కావాలంటే కావాల్సినంత గొడ‌వ‌ల‌కు సిద్ధ‌మ‌ని చెప్పారు. కానీ త‌న గొడ‌వ అభివృద్ధికి దోహ‌దప‌డే గొడ‌వ అని చెప్పారు. స‌న్నాసుల‌ను చిత్త‌కొట్టి అభివృద్ధికి బాట‌లు వేసే గొడ‌వ అని అన్నారు. నాలుగు నెలలు చూశామని తనకు సహనం పోయిందని అన్నారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తామ‌ని అన్నారు. అదే విధంగా ఆడ‌పిల్ల‌ల మాన ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని అన్నారు. వాళ్ల జోలికి వ‌స్తే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఆడ‌బిడ్డ‌ల కోసం ఈ ప్ర‌భుత్వం పెద్ద‌పీఠ వేస్తోంద‌ని హామీ ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో ఆడ‌బిడ్డ‌ల‌ను దారుణంగా దూషిస్తున్నార‌ని వాళ్లంద‌రినీ గుర్తిస్తున్నామ‌ని చెప్పారు. ఎవ్వ‌రినీ వ‌దిలి పెట్ట‌మ‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే పోలీసు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశామ‌ని అన్నారు.

Advertisement

సోష‌ల్ మీడియాలో ఆక‌తాయిల కోసం డిజిట‌ల్ ప్రైవ‌సీ యాక్ట్ వ‌స్తోంద‌ని తెలిపారు. ఆ యాక్ట్ వ‌స్తే ఎవ‌రు త‌ప్పు చేసినా క్రిమిన‌ల్ రికార్డు ఉంటుంద‌న్నారు. సోష‌ల్ మీడియాలో ఆడ‌వాళ్ల‌ను దూషిస్తే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు ఉంటాయ‌ని, అవ‌న్నీ రికార్డు అవుతాయ‌ని ముందే హెచ్చ‌రిస్తున్నామ‌ని తెలిపారు. మాన‌వ హ‌క్కుల‌ను నిల‌బెట్ట‌డం కోస‌మే తాము గ‌త ప్ర‌భుత్వంపై పోరాటం చేశామ‌న్నారు. ఏనాడూ తాము ఆడ‌వాళ్ల గురించి అన్యాయంగా మాట్లాడ‌లేద‌న్నారు. ఆ నాయ‌కుడి సొంత సోద‌రే త‌న ప్రాణాల‌కు ర‌క్ష‌ణ కావాల‌ని, సెక్యురిటీ కావాల‌ని కోరుతోంద‌ని అన్నారు. మీ అన్న భ‌ద్ర‌త క‌ల్పించ‌లేదేమో కానీ మేము ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని మాజీ సీఎం జ‌గ‌న్, ఆయ‌న సోద‌రి ష‌ర్మిల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×