BigTV English

Allu Ayaan: బన్నీ కొడుకు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా.. అల్లు అర్జున్ అయితే కాదట

Allu Ayaan: బన్నీ కొడుకు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా.. అల్లు అర్జున్ అయితే కాదట

Allu Ayaan: సాధారణంగా తండ్రి హీరో అయితే.. కొడుకు ఫేవరేట్  తండ్రే అయ్యి ఉంటాడు.  ప్రతి కొడుకుకు తన తండ్రే మొదటి హీరో. ఇప్పుడు ఉన్న హీరోస్ ను  అడిగితే.. తమ తండ్రే తన  ఫేవరేట్ హీరో అని చెప్తారు. కానీ, జనరేషన్ మారింది. ఇప్పుడు హీరోల కొడుకులు.. తమకు నచ్చిన హీరోల పేర్లు నిర్మొహమాటంగా  చెప్పేస్తున్నారు. అది హీరోలు కూడా ఎంతో స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు. ఎవరి ఇష్టాన్ని ఎవరు మార్చలేరు. అలా మార్చకూడదు కూడా. అందుకు నిదర్శనం అల్లువారి వారసుడు అల్లు అయాన్.  సోషల్ మీడియాలో అయాన్ ను కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతులు పోతాయి.


అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల  మొదటి వారసుడు అల్లు అయాన్. కూతురు అర్హ  పుట్టేవరకు కూడా  అందరూ అయాన్ కోసమే ఎదురుచూసారు. కానీ, అర్హ పుట్టాకా.. ఫ్యాన్స్ అందరితో పాటు అల్లు కుటుంబాన్ని కూడా తనవైపుకు లాగేసుకుంది ఈ చిన్న యువరాణి. అల్లు అరవింద్ కూడా అర్హ చాలా తెలివైందని, తనతో అసలు గొడవపడలేమని చెప్పుకొచ్చాడు. ఇక కూతురుతో బన్నీ చెప్పించే మాటలు, ఆటలు, పాటలు అన్ని నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముద్దు ముద్దు మాటలతో ఆ చిన్నారి చెప్పే మాటలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యేవారు.

EID 2025 : ఈద్ బరిలో మోహన్ లాల్… పవన్, సల్మాన్ లతో పోటీకి రెడీ


ఇక దీంతో అయాన్ ఎక్కువ సోషల్ మీడియాలో కనిపించలేదు. ఆ తరువాత అయాన్ చేసే అల్లరి పనులు.. నెట్టింట వైరల్ గా మారడం మొదలుపెట్టాయి. తాజాగా బన్నీ..  బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు వెళ్లిన విషయం తెల్సిందే. నిజం చెప్పాలంటే .. ఈ ఎపిసోడ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద వివాదాల్లో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఒకటి.

జనసేనాని పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ ఇవ్వకుండా వైసీపీ నేతకు సపోర్ట్ ఇస్తూ.. బన్నీ  వారి ఇంటికి  వెళ్లి ప్రచారం చేయడం అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  దీనివలన మెగా – అల్లు కుటుంబాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అప్పటినుంచి అల్లు ఫ్యాన్స్ , మెగా ఫ్యాన్స్ విడిపోయారు. ఇక వేదికపై బన్నీ..నంద్యాల పర్యటన వివాదంపై క్లారిటీ ఇచ్చిన్నట్లు వార్తలు రావడంతో ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.

Rashmika Mandanna: ఎన్నిసార్లు ఆ ఇంట్లోనే అడ్డంగా దొరికిపోతావ్ రష్మిక..

ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఈ  షోలో బన్నీతో పాటు ఆయన పిల్లలు  కూడా సందడి చేసినట్లు తెలుస్తోంది. మధ్యలో కొద్దిసేపు అయాన్, అర్హ బాలయ్యతో సందడి చేశారట. బాలయ్య అడిగిన ప్రశ్నలకు ఇద్దరు తడుముకోకుండా సమాధానాలు చెప్పారని టాక్. ముఖ్యంగా అల్లు అయాన్ ను నీ ఫేవరేట్ హీరో ఎవరు అని బాలయ్య అడిగితే.. తండ్రి అల్లు అర్జున్ పేరు చెప్పకుండా టక్కున ప్రభాస్ అని చెప్పి షాక్ ఇచ్చాడట.

ప్రభాస్ పేరు వినగానే  ఆ వేదిక అంతా క్లాప్స్ తో దద్దరిల్లిపోయిందని అంటున్నారు. అయాన్ ఫేవరేట్ హీరో  ప్రభాస్ అని చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్ మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయాన్ నే  కాదు అర్హను కూడా బాలయ్య అదే ప్రశ్న అడిగాడట. మరి అర్హ ఏం చెప్పిందో తెలియాలంటే.. ఎపిసోడ్  వచ్చేవరకు ఆగాల్సిందే అని అంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×