E-Paper
Advertisement

pawankalyan: పవన్ కళ్యాణ్‌కి డాక్టరేట్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జనసేనాని

pawankalyan: పవన్ కళ్యాణ్‌కి డాక్టరేట్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జనసేనాని
Advertisement

pawankalyan: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు రాజకీయాలలో బిజీ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ తన సినిమాల షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చి పూర్తిగా తన టైంని పార్టీ కోసమే కేటాయిస్తున్నారు. ఇకపోతే పవన్ రాజకీయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు.

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్‌కి తాజాగా ఒక ఉన్నత గౌరవం దక్కింది. తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ వారు జనసేనానికి డాక్టరేట్ ప్రధానం చేసేందుకు సెలక్ట్ చేశారు. ఈ నెలలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ ఈవెంట్‌కి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు. కానీ, పవన్ మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వివిధ రంగాలలో రాణించిన గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారని.. వారికి డాక్టరేట్ ఇవ్వాలని పవన్ కోరారు. ఈ మేరకు తనకు ఇస్తున్న డాక్టరేట్‌ని తిరస్కరిస్తూ వేల్స్ యూనివర్సిటీకి పవన్ లేఖ రాశారు.

Advertisement

తనని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్‌కి సెలక్ట్ చేయడం సంతోషంగా, గౌరవంగా ఉందని అన్నారు. కానీ తనకంటే చాలా మంది గొప్పవారు ఉన్నారని.. వారిలో సరినవారికి ఈ డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా పవన్ కోరారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా యూనివర్సిటీ 14వ కన్వకేషన్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×