E-Paper
Advertisement

Posani: నంది అవార్డులు కాదు.. కమ్మ అవార్డులు.. పోసాని కలకలం..

Posani: నంది అవార్డులు కాదు.. కమ్మ అవార్డులు.. పోసాని కలకలం..
Advertisement
posani nandi

posani: గ్యాప్ వచ్చిందో లేదంటే గ్యాప్ తీసుకున్నారో తెలీదు కానీ.. పోసాని కృష్ణమురళి మరోసారి రెచ్చిపోయారు. గతంలో చేసిన కామెంట్లే.. మళ్లీ చేసి రచ్చ రాజేశారు. అవి నంది అవార్డులు కాదు.. కమ్మ అవార్డులు అంటూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.

అవార్డులు అనేవి కులం, మతం చూసి ఇవ్వకూడదని.. నంది అవార్డులు అలాగే ఇచ్చేవారని పోసాని అన్నారు. నేరుగా చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేశారు. ఆయన హయాంలో గ్రూపులు, కులాల వారీగా అవార్డులు పంచుకునేవారని ఆరోపించారు.

Advertisement

‘టెంపర్‌’ మూవీలో నటనకుగాను.. తప్పక ఇవ్వాల్సిన పరిస్థితుల్లో వేరే ఆప్షన్‌ లేక తనకు నంది అవార్డు ఇచ్చారని గుర్తు చేశారు. తాను కూడా వెళ్లి ఆ అవార్డు తీసుకున్నానని.. అయితే ఎవరెవరికి ఏయే అవార్డులు ఇచ్చారో చూశాక అసలు విషయం అర్థమైందని చెప్పారు. అప్పుడు అవార్డుల కమిటీలో 11మంది కమ్మ కులం వారే ఉన్నారని.. అవార్డులు ఇచ్చిన తీరు తనకు నచ్చలేదన్నారు. అందుకే, తనకొచ్చిన నంది అవార్డును తిరస్కరించానని చెప్పుకొచ్చారు పోసాని. తెలుగు ఇండస్ట్రీని కులాలు, మతాలు కాదు శాసించేది.. డబ్బు ఒక్కటే అంటూ మరో విమర్శ కూడా చేశారు.

తాను గాయం, పవిత్ర బంధం, శివయ్య లాంటి ఎన్నో మంచి సినిమాలకు కథ రాశానని.. కానీ అప్పుడు తనకు నంది అవార్డు రాలేదని పోసాని పెదవి విరిచారు. ఏపీ ఫైబర్‌నెట్‌ ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పోసాని కృష్ణమురళి తన వ్యాఖ్యలతో కలకలం రేపారు.

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×