BigTV English

RRR: జగన్ కు షాక్.. కాకరేపుతున్న రఘురామ కటౌట్..

RRR: జగన్ కు షాక్.. కాకరేపుతున్న రఘురామ కటౌట్..

RRR: ఆర్ఆర్ఆర్. సినిమా అయినా.. రాజకీయమైనా.. త్రిపుల్ ఆర్ ఓ సంచలనం. రాజమౌళి సినిమా అంతర్జాతీయ అవార్డులు కొల్లగొడుతుంటే.. పొలిటికల్ RRR రఘురామకృష్ణరాజు కటౌట్ సంక్రాంతికి కాక రేపుతోంది. ఇదే ఆ కటౌట్.


ఏపీలో రఘురామ పేరే లేకుండా చేయాలని సర్కారు పంతం పట్టింది. ఆయన రాష్ట్రంలో అడుగుపెడితే అరెస్ట్ చేసేందుకు కేసులతో సిద్ధంగా ఉంది. ఈ విషయం పసిగట్టిన రఘురామ.. ఏపీకి వస్తే ఒట్టు. ఢిల్లీ, హైదరాబాద్ లోనే సెటిల్డ్ గా ఉంటున్నారు. వైసీపీకీ కావాల్సిందిదే.

కట్ చేస్తే.. సడెన్ గా ఈ సంక్రాంతికి భీమవరంలో ప్రత్యక్షమయ్యారు రఘురామ. నేరుగా వచ్చే ధైర్యం లేక.. అంతెత్తు కటౌట్ రూపంలో కనిపించారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలంటున్నారు RRR ఫ్యాన్స్. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. రఘురామ విషయంలో సర్కారు నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించారు. ఏపీలో ఫ్లెక్సీలపై నిషేధం ఉన్నందున.. ఫ్లెక్సీ మెటీరియల్ వాడకుండానే పేపర్, క్లాత్ తో అంత పెద్ద కటౌట్ చేయించారు. అలా రూల్స్ పాటించారు. ఏపీలో రఘురామ ఉనికే లేకుండా చేయాలని చూస్తున్న అధికార పార్టీకి ఇది ఊహించని షాకే.. అంటున్నారు.


భీమవరంలో అంతపెద్ద కటౌట్ పెట్టడమే ఓ సంచలనం అయితే.. ఇక కటౌట్ లో ఉన్న కంటెంట్ మరింత షాకింగ్. కోడిపందాలకు సింబాలిక్ గా రఘురామ చేతిలో ఓ పందెంకోడి ఉన్నట్టు రూపొందించారు. అయితే, జాగ్రత్తగా గమనిస్తే.. ఆ కోడి తల స్థానంలో జగన్ ఫేస్ ఇమేజ్ ను ఉంచడం మరింత కలకలం రేపుతోంది.

కోడికత్తి ఘటనకు సింబాలిక్ గానో.. లేదంటే, పందెంకోడిలా ఆడిస్తాననో.. థీమ్ ఏదైనా రఘురామ చేతిలో జగన్ ఫేస్ తో మార్ఫింగ్ చేసిన పందెంకోడి పెట్టడం.. రాజకీయంగా ఉద్రిక్తతను రాజేస్తోంది. ఆ కటౌట్ కట్టిన వారి కోసం ఏపీ సీఐడీ ఆరా తీస్తున్నట్టు సమాచారం.

ఇంతకీ ఈ కటౌట్ కట్టింది ఎవరు? రఘురామకు భీమవరంలో ఇంతటి తెగింపు ఉన్న వీరాభిమానులు ఉన్నారా? దీని వెనుక టీడీపీ హస్తం ఉందా? రఘురామనే తన మనుషులతో ఈ కటౌట్ ఏర్పాటు చేయించారా? ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. కటౌట్ మీదా ఓ కేసు బుక్ చేసి.. రఘురామను మరింత టార్గెట్ చేయడం ఖాయం అంటున్నారు.

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×