BigTV English

Cock Fight: గత సంక్రాంతికి గుడివాడ క్యాసినో.. ఈసారి గన్నవరమా?.. ఆ కోడిపందేలకు ఎంట్రీ ఫీజు 60వేలు!

Cock Fight: గత సంక్రాంతికి గుడివాడ క్యాసినో.. ఈసారి గన్నవరమా?.. ఆ కోడిపందేలకు ఎంట్రీ ఫీజు 60వేలు!

Cock Fight: సంక్రాంతి అంటే కోడిపందేలు. అందులోనూ గోదావరి జిల్లాలు. పండగ సందడంతా అక్కడే ఉంటుంది. ఊరూరా కోడి బరులు.. పందెంరాయుళ్లతో తిరునాళ్లని తలపిస్తుంటాయి. ఆ పక్కనే గుండాట, పేకాట, మందు, మాంసంతో మజా మజాగా నడుస్తుంది. కోట్లలో పందెం సొమ్ము చేతులు మారుతుంది. గెలిచిన వాళ్లు అసలైన పండుగ చేసుకుంటే.. ఓడిన వాళ్లు మళ్లీ సంక్రాంతి వరకూ కోలుకునే పరిస్థితి ఉండదు. కోర్టులు, ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. మీడియా లైవ్ ల సాక్షిగా కోడిపందేలు జోరుగా సాగిపోతుంటాయి. ఏటేటా ఇదే తంతు.


గోదావరి జిల్లాల సంక్రాంతి సంబరాలకు షాక్ ఇచ్చేలా.. గతేడాది గుడివాడ క్యాసినో రచ్చ రేపింది. అప్పటిమంత్రి కొడాలి నాని పేరుతో పొలిటికల్ గా రచ్చ రాజేసింది. అయితే, ఈసారి హాట్ టాపిక్ గన్నవరం అంటున్నారు. ఈ సంక్రాంతికి గన్నవరం నియోజకవర్గంలో స్పెషల్ కోడిపందేలు రెడీ అవుతున్నాయని తెలుస్తోంది. గోదావరి జిల్లాలకు ధీటుగా.. హై రేంజ్ లో బరిలు సిద్ధం చేశారట. అంపాపురం, హనుమాన్ జంక్షన్, ఉంగుటూరు, బాపులపాడు తదితర ఏరియాల్లో.. వందల ఎకరాల్లో హైటెక్ కోడిపందేలకు బరి గీశారని సమాచారం. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని టాక్.

హనుమాన్ జంక్షన్ లో ఒక్కో బరికి సుమారు 2 ఎకరాలు కేటాయించారని చెబుతున్నారు. పెద్ద పెద్ద పందెంరాయుళ్లకు మాత్రమే ఎంట్రీ అంటున్నారు. ఇప్పటికే ఆ బిగ్ బాబులకు ఇన్విటేషన్లు వెళ్లిపోయాయట. VIP- A, B, C గ్రేడులుగా విభజించి పాసులు అమ్ముతున్నారని తెలుస్తోంది. ఏ గ్రేడ్ పాస్ కు ఏకంగా 60 ఎంట్రీ రుసుము వసూలు చేస్తున్నారు. ఇక, బి గ్రేడ్ కు 40 వేలు.. సీ గ్రేడ్ వీఐపీ పాస్ కు పాతిక వేలు చెల్లించాల్సి ఉంటుంది.


ఏ గ్రేడ్ పాస్ ఉన్నవాళ్లను మాత్రమే ప్రధాన బరిలోకి అనుమతిస్తారు. అక్కడ 5 లక్షల వరకు పందెం నిర్వహిస్తారని తెలుస్తోంది. బీ గ్రేడ్ బరిలో లక్ష నుంచి 3 లక్షల వరకు.. అదే లక్షలోపు పందేలు కాసేవారికి సీ గ్రేడ్ బరులను కేటాయిస్తారట. ఎంట్రీ పాసులతో వచ్చిన వారి చేతికి బార్ కోడ్ తో కూడిన స్పెషల్ ట్యాగ్ వేసి లోనికి అనుమతించేలా సెటప్ సిద్ధం చేశారు. కోడిబరుల నిర్వహణకు, పందెంరాయుళ్ల నియంత్రణకు వందకు పైగా బౌన్సర్లను అరేంజ్ చేశారని అంటున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వీవీఐపీ పందెంరాయుళ్ల కోసం విజయవాడ, హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లోని లగ్జరీ హోటల్స్ లో వందలాది రూమ్ లు బుక్ చేశారని చెబుతున్నారు. వాళ్ల కోసం అన్నిరకాల నాన్ వెజ్ ఐటమ్స్ వండిస్తున్నారని.. ప్రత్యేక వంటకాలు, పలురకాల టిఫిన్లు.. హైరేంజ్ మద్యం బాటిళ్లు రెడీ చేశారని అంటున్నారు. క్యాలెండర్ లో డేట్ మారడమే తరువాయి. కాస్ట్లీ కోడిపందేలకు సర్వం రెడీ!

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×