BigTV English

Telugu Doctor Died : ఆస్ట్రేలియాలో కృష్ణాజిల్లా యువతి మృతి

Telugu Doctor Died : ఆస్ట్రేలియాలో కృష్ణాజిల్లా యువతి మృతి
telugu doctor vemuru ujwala
telugu doctor vemuru ujwala

Telugu Doctor Died in Australia(News update today in telugu): చిన్నప్పటి నుంచి వైద్యురాలు కావాలన్న తన కలను సాకారం చేసుకుంది. ఇష్టమైన చదువు చదివింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి.. నచ్చిన విభాగంలో పీజీ చేసి.. మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని నిర్ణయించుకుంది. కానీ.. విధికి ఆమెపై కన్ను కుట్టింది. ఆమె కలలను చూసి ఓర్వలేక.. మరణ రూపంలో ఆమె కన్న కలలన్నింటినీ కల్లలుగా మార్చేసింది. ఫ్రెండ్స్ తో ఆనందంగా, సరదాగా గడపానలని ట్రెక్కింగ్ కు వెళ్లడమే ఆమె పాలిట శాపంగా మారింది.


Read More : బీజేపీతో పొత్తు ఓ కొలిక్కి వచ్చినట్టే ..!

కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. మార్చి 2న సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లిన ఉజ్వల.. కాలుజారి లోయలో పడి మరణించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కూతురి మరణవార్త విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి – వెంకటేశ్వరరావు ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. ఆమె అంత్యక్రియలను మాత్రం స్వగ్రామంలోనే నిర్వహించనున్నారు. శనివారం ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి ఉజ్వల భౌతిక కాయాన్ని తీసుకురానున్నారు.


Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×