BigTV English

Police Officer Beats Muslims : నమాజ్ చేస్తున్న ముస్లింలను కాలితో తన్నిన పోలీస్.. నెట్టింట దుమారం రేపుతున్న వీడియో

Police Officer Beats Muslims : నమాజ్ చేస్తున్న ముస్లింలను కాలితో తన్నిన పోలీస్.. నెట్టింట దుమారం రేపుతున్న వీడియో


policeman kicking Muslims during their prayers ( national news today india) : అత్యంత దిగ్భ్రాంతికరమైన, ఆందోళన కలిగించే సంఘటన ఢిల్లీలో జరిగింది. రోడ్డుపై నమాజ్ చేస్తున్న వ్యక్తులను అకారణంగా కొట్టడమే కాకుండా.. కాలితో తన్నాడొక పోలీస్ ఆఫీసర్. ఈ దృశ్యాలను స్థానికంగా ఉన్నవారు వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి. 34 సెకన్ల నిడివి ఉన్న వీడియోలలో పోలీస్ అధికారి నమాజ్ చేస్తున్నవారిని కాలితో తన్నడం కనిపిస్తుంది.

దేశరాజధాని ఢిల్లీలో నార్త్ లో ఉన్న ఇందర్ లోక్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. శుక్రవారం కావడంతో కొందరు ముస్లిం సోదరులు పొరుగున ఉన్న మసీదు రోడ్డు వద్ద ప్రార్థనలు చేపట్టారు. సజ్దా సమయంలో పోలీస్ ఇన్ ఛార్జ్ అధికారి వారిని కాలితో తన్ని నమాజ్ కు ఆటంకం కలిగించారు. ట్రాఫిక్ కు ఇబ్బందనో, ఇంకో కారణం చేతనో ఆ పోలీస్ అధికారి ఈ పనిచేసినా.. వారిని అలా తన్ని ఉండకూడదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read More : పండుగపూట రాజస్థాన్‌లో విషాదం, ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం


నమాజ్ చేస్తున్న వారిని తన్నడం, వెనుక నుంచి నెట్టడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. ప్రార్థన సమయంలో ఇలా చేయడం తగదని వాగ్వాదానికి దిగగా.. పోలీస్ అధికారి మరింత రెచ్చిపోయాడు. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో.. అతనిపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే సస్పెండ్ చేశామని ఢిల్లీ డీఎస్పీ ఎంకే మీనా తెలిపారు. అయితే పోలీస్ అధికారిని కొందరు సమర్థిస్తున్నారు. నమాజ్ మసీదులో కాకుడా రోడ్డుపై చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు.. నిజంగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగి ఉంటే.. నచ్చజెప్పి ఉండాల్సింది కానీ.. ఇలా కాలితో తన్నడం సబబు కాదంటున్నారు.

అయితే.. అక్కడున్న మసీదు నిండి.. లోపల నమాజ్ చేసే ఖాళీ లేకపోవడం వల్లే వారు రోడ్డుపై నమాజ్ చేసినట్లు తెలుస్తోంది. తమను కాలితో తన్నిన పోలీస్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇదొక సిగ్గుమాలిన చర్య అని అభిప్రాయపడ్డారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×