E-Paper
Advertisement

TTD Chairman BR Naidu: డీప్ ఫేక్ వీడియోలతో ప్రచారం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం, ఆపై ఫిర్యాదు

TTD Chairman BR Naidu: డీప్ ఫేక్ వీడియోలతో ప్రచారం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం, ఆపై ఫిర్యాదు
Advertisement

TTD Chairman BR Naidu: అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత డీప్ ఫేక్ వీడియోలపై తీవ్ర గందరగోళం నెలకుంటోంది. ఏది నిజమో.. ఏది అబద్దమూ తెలియడం లేదు. ఫలితంగా సంబంధిత వ్యక్తి ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ఇటీవలకాలంలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయాలు ఈ ఉచ్చులో పడ్డారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అలాంటి సమస్య ఎదురైంది.

డీప్ ఫేక్ వీడియోలతో ప్రచారం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

Advertisement

డీప్ ఫేక్ వీడియోలపై కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయడంపై సీరియస్ అయ్యారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. దీనిపై ఎక్స్ వేదికగా ఆయన రియాక్ట్ అయ్యారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

AI టెక్నాలజీని ఉపయోగించుకుని తన రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ విధంగా ప్రచారం చేస్తున్న కంటెంట్ మొత్తం అసత్యమైనదని రాసుకొచ్చారు. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన ప్లాన్‌గా తెలిపారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని, వైసీపీ‌కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు.

Advertisement

సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు.. రాజీనామా చేయలంటూ వైసీపీ డిమాండ్

దీనిపై తాను చట్ట ప్రకారం ముందుకెళ్తానని తెలిపారు. సోషల్ మీడియాలో తనపై సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులు, దుష్టశక్తులను వదిలేది లేదని తేల్చిచెప్పారు.

బీఆర్ నాయుడు వీడియోలపై అటు వైసీపీ రియాక్ట్ అయ్యింది. నైతిక విలువలు ఉండి ఉంటే టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అడ్డంగా దొరికిపోయి అడ్డదారుల్లో మాపై నిందలు వేస్తారా అంటూ ప్రశ్నించారు. మా హయాంలో SVBC ఛైర్మన్‌పై ఆడియో క్లిప్ వెలుగులోకి రాగానే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించామని అన్నారు.

ALSO READ: ఏపీని ‘తెలుగునాడు’గా మార్చాలంటూ గరికిపాటి డిమాండ్

సీఎం చంద్రబాబుకు ఏ మాత్రం వెంకటేశ్వరస్వామిపై గౌరవం ఉన్నా వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి BR నాయుడును బర్త్‌రఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. మాపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలని చూసినా నిజాలు బయటకు వస్తాయని అన్నారు. పరాకామణి, లడ్డూలో ఎన్ని అసత్యాలు మాట్లాడుతున్నా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించి రెండు డీప్ ఫేక్ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెల్సిందే.

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×