E-Paper
Advertisement

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు
Advertisement

Rain Alert: ఎట్టకేలకు దక్షిణాది రాష్ట్రాలకు వాన కబురు వచ్చేసింది. ఏపీ-తెలంగాణల్లో వారం రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. హైదరాబాద్ లో అదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది.

దక్షిణాది రాష్ట్రాలకు వానకబురు-ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు దంచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా  కురుస్తున్నాయి. ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు వాన కబురు చెప్పింది. జూలై 21 నుంచి 27 వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అదే సమయంలో ఈనెల 23 లేదా 24న మధ్య అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement

వారం రోజులపాటు భారీ వర్షాలు-దీని కారణంగా నైరుతి రుతుపవనాలు పుంజుకోనున్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వర్షపాతం పెరిగే అవకాశం ఉందని ఓ అంచనా. ఇప్పటికే ఉత్తర, మధ్య, తూర్పు భారతంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు.

అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలు ఉన్నాయి.  వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల  వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

Advertisement

హైదరాబాద్ సిటీలో అర్థరాత్రి నుంచి చిరు జల్లులు-హైదరాబాద్‌ సిటీకి సంబంధించి అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి.  పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయపు వేళ ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ,  చెప్పుకోదగ్గ వర్షపాతం ఉండదు. అక్కడక్కడా చినుకులు పడే అవకాశం మాత్రమే ఉందని వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావం ఉత్తర కోస్తాంధ్రపై పడనుంది. దీని కారణంగా మంగళవారం రాష్ట్రంలో మేఘావృతమై ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఓ ప్రకటనలో పేర్కొంది.

ALSO READ: మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక సోమవారం అనకాపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.

 

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×