E-Paper
Advertisement

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!
Advertisement

Maaza Bottle: సమ్మర్ పోయి వర్షాలు పడుతున్నా, కూల్ డ్రింక్ తాగాలనే కోరిక మాత్రం ఎవరికీ తగ్గదు కదా! కానీ, ఓ నాలుగేళ్ల బుడతడు మాత్రం ‘హాయిగా మాజా తాగుదాం’ అనుకుంటే.. అందులో అతనికి ఎదురైన అనుభవం చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఎందుకంటే, ఆ బాటిల్‌లో వచ్చింది మాజా మాత్రమే కాదు.. బోనస్‌గా ఒక పురుగు కూడా వచ్చింది!

ఈ షాకింగ్ ఘటన రంపచోడవరంలో కలకలం రేపింది. స్థానికంగా ఉండే ఒక నాలుగేళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు ‘మాజా’ డ్రింక్ కొనిచ్చారు. సరే పిల్లోడు ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు కదా అని చూసేసరికి.. ఆ లిక్విడ్‌లో ఏదో తేలుతున్నట్టు అనుమానం వచ్చింది. తీరా నిశితంగా గమనిస్తే, అందులో చచ్చిపోయిన పురుగు అవశేషాలు కనిపించాయి. దాంతో ఆ కుటుంబ సభ్యుల గుండె ఒక్కసారిగా జారినంత పనైంది.

Advertisement

అదృష్టవశాత్తూ వారు సకాలంలో ఆ పురుగును గమనించడంతో, వెంటనే బాలుడి చేతి నుంచి ఆ బాటిల్‌ను లాగేసుకున్నారు. లేదంటే ఆ పిల్లాడు దాన్ని తాగేసి తీవ్ర అస్వస్థతకు గురయ్యేవాడు. తృటిలో పెద్ద ప్రమాదమే తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

Advertisement

ఈ విషయం చుట్టుపక్కల తెలవడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ‘మేము నమ్మి కొనుక్కునే బ్రాండెడ్ డ్రింక్స్‌లోనే ఇలాంటివి ఉంటే.. ఇక మా పిల్లల ప్రాణాలకి గ్యారెంటీ ఏంటి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఏదేమైనా, పిల్లలకి ఇలాంటి ప్యాక్డ్ ఫుడ్స్, డ్రింక్స్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మన బాధ్యత అని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×