BigTV English

Kalyani on YS Sharmila: మీరు రెడీనా షర్మిళా.. మీ అన్నపైనే కక్ష సాధిస్తారా.. వర్రా భార్య కల్యాణి వార్నింగ్

Kalyani on YS Sharmila: మీరు రెడీనా షర్మిళా.. మీ అన్నపైనే కక్ష సాధిస్తారా.. వర్రా భార్య కల్యాణి వార్నింగ్

Kalyani on YS Sharmila: నా భర్తను సైకో అంటారా.. అరెస్ట్ చేయడం సబబేనంటారా.. నా భర్తను చంపాలని చూస్తున్నారా.. ఆయనకు ఏం జరిగినా మీదే భాధ్యత.. మరచిపోవద్దు నా భర్త చేసిన మేలు.. అంటూ కడప జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా వర్కర్ వర్రా రవీంద్రారెడ్డి భార్య కల్యాణి వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ ఎవరికో తెలుసా.. ఏకంగా వైఎస్ షర్మిళకే!


ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, పలువురిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్రా రవీంద్రా రెడ్డిని కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రవీంద్రా రెడ్డి పోలీసుల అదుపులో నుండి తప్పించుకున్నట్లు కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతకు ఈ వ్యవహారానికి సంబంధించి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును కూడా బదిలీ చేసినట్లు హాట్ టాపిక్ చర్చ సాగుతోంది. ఏదిఏమైనా వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్ పై షర్మిళ స్పందించారు.

తనను, తన తల్లి విజయమ్మను, చెల్లెలు సునీతను సోషల్ మీడియా వేదికగా రవీంద్రారెడ్డి ట్రోలింగ్ చేసినట్లు, ఈ అరెస్ట్ సబబేనని తాజాగా షర్మిళ తన ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి వారిని వదిలిపెట్టొద్దని ఎవరైనా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వదలవద్దంటూ కూటమి ప్రభుత్వాన్ని కోరారు షర్మిళ.


ఈ కామెంట్స్ పై రవీంద్రారెడ్డి భార్య కల్యాణి కౌంటర్ ఇచ్చారు. షర్మిళ పై బాలకృష్ణ ఇంటి నుండే తప్పుడు పోస్టులు పెడితే పోరాడింది తన భర్త అని, మీ అన్న, వదినలపై తప్పుడు వార్తలు రాస్తే పోరాటం చేసింది కూడా తన భర్త అంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు.. తన భర్త పేరుపై టీడీపీ ఏకంగా 18 ఫేక్ అకౌంట్లు సృష్టించి తప్పుడు పోస్టులు పెట్టారని, నా భర్తను అడ్డు చూపించి మీ అన్నపై కక్షసాధించాలని అనుకుంటున్నారా? ఏ రోజు వైఎస్సార్‌ కుటుంబాన్ని ఒక్క చిన్న మాట కూడా నా భర్త మాట్లాడలేదని నేను వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేస్తానంటూ సవాల్ విసిరారు.

Also Read: Pemmasani Chandrasekhar: వ్యవస్థలను దిగజార్చారు.. నిజాలు బయట పెట్టిన కేంద్రమంత్రి పెమ్మసాని

మీరు నా భర్త తప్పు చేశాడని బైబిల్‌పై ప్రమాణం చేస్తారా? నా భర్త వైఎస్సార్‌ కుటుంబం కోసమే పోరాటం చేశారు తప్ప మీలా చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించలేదని, మీలా ఆస్తి కోసం అన్నను అప్రతిష్ట పాలు చేసే బుద్ధులు మాకు రావంటూ విమర్శించారు. నా భర్తను చంపాలని చూస్తున్నారని, ఆయనకు ఏం జరిగినా హోం మంత్రి అనిత, కూటమి ప్రభుత్వానిదే భాద్యత అంటూ కళ్యాణి వీడియో విడుదల చేశారు. మరి ఈ కామెంట్స్ కి షర్మిళ రిప్లై ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×