Train Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. వారణాసి రైల్వే స్టేషన్ లో రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీదికి దూసుకొచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన ఓ లోకో పైలెట్ ట్రైన్ కు సడెన్ బ్రేకులు వేశాడు. ఎదురుగా ఉన్న రైలుకు 500 మీటర్ల దూరంలో నిలిపాడు. ఘోర ప్రమాదాన్ని తప్పించాడు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి అధికారులు షాక్ అయ్యారు. వెంటనే, సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.
ఒకే ట్రాక్ మీదికి రెండు రైళ్లు
వారణాసి రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం తప్పింది. స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్, అయోధ్య ధామ్ స్పెషల్ ట్రైన్ ఒకే ట్రాక్ మీదకి వచ్చాయి. వెంటనే స్పందించిన అయోధ్య ధామ్ లోకో పైలెట్ సడెబ్ బ్రేక్ వేశాడు. స్వతంత్ర సేనానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఈ విషయం తెలియకుండానే స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ సిగ్నల్ ను దాటుకుని వెళ్లిపోయింది. అయోధ్య ధామ్ లోకో పైలెట్ ఏమాత్రం గమనించకపోయినా ఘోరం జరిగేది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
వారణాసి జంక్షన్ లోని ప్లాట్‌ఫాం నంబర్ 3 నుంచి బయలుదేరే అయోధ్య ధామ్ ప్రత్యేక రైలుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైలు వారణాసి జంక్షన్ సమీపంలోని యార్డ్ కు చేరుకోగా, స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ వెనుక భాగం ఇంకా అదే ట్రాక్ లో ఉన్నట్లు లోకో పైలెట్ గమనించాడు. వెంటనే అలర్ట్ అయి ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. రైలు వేగాన్ని తగ్గించడంతో.. అయోధ్య ధామ్ స్పెషల్ ట్రైన్, స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ కు 50 మీటర్ల ముందు ఆగింది. క్షణాల్లో పెను ప్రమాదం తప్పింది.
విచారణ కమిటీ ఏర్పాటు
ఒకే ట్రాక్ మీదికి రెండు రైళ్లు వచ్చిన విషయాన్ని అయోధ్య ధామ్ ప్రత్యేక రైలు లోకో పైలెట్ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. రెండు రైళ్ల ప్రయాణానికి రూట్ క్లియర్ చేశారు. ఈ విషయం తెలిసి ప్రయాణీకులు సైతం షాక్ అయ్యారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. సంబంధిత శాఖలతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వ్యక్తిపై సీరియస్ యాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ప్రయాణీకులకు ఎటువంటి హాని జరగకపోవడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు. గత కొద్ది నెలలుగా వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు అలెర్ట్ గా ఉంటున్నారు. అయినప్పటికీ, వారణాసి ఘటన జరగడంతో రైల్వే శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Read Also: ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ రైల్వే లైన్స్ .. వెళ్తుంటే వణుకు పుట్టాల్సిందే!