BigTV English

YSRCP Third List: వైసీపీ మూడో జాబితాలో భారీ మార్పులు? టికెట్ ఇవ్వని నేతలకు కొత్త హామీలు

YSRCP Third List: వైసీపీ మూడో జాబితాలో భారీ మార్పులు? టికెట్ ఇవ్వని నేతలకు కొత్త హామీలు

YSRCP Third List: వైసీపీ మూడో జాబితాలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 13 మందికి జగన్‌ మొండిచేయి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వాళ్లు అలకబూనకుండా.. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని భరోసానిస్తున్నారు. జాబితా మరింత ఆలస్యం అవుతుండటంతో వైసీపీ నేతలు టెన్షన్‌ తట్టుకోలేకపోతున్నారు.


అయితే మూడో జాబితా ఇదిగో.. అదిగో అంటూ వైసీపీ పది రోజుల నుంచి కాలం వెల్లదీస్తోంది. క్యాంపు ఆఫీసుకు ఎమ్మెల్యేలను పిలిచినా వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, వైజాగ్‌ జిల్లాల మార్పులు చేర్పులతో థర్డ్‌ లిస్ట్‌ విడుదల అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

మరోవైపు వైసీపీలో అసంతృప్తుల బెడద తీవ్రంగా ఉంది. సీఎం దర్శనం కోసం వేచి చూసి మాజీ మంత్రి బాలినేని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వెళ్లే ముందు ఐ ప్యాక్‌ టీమ్‌కు తాను అనుకున్నది చెప్పి అక్కడి నుంచి బయల్దేరారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే అలకపాన్పుపై ఉన్న మల్లాది విష్ణు, పార్థసారధి వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ లోగా కర్నూల్‌ ఎంపీ సంజీవ్‌ కుమార్‌ రాజీనామా చేశాడు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×