E-Paper
Advertisement

Remedies: ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరపడలేకపోతున్నారా..? అయితే ఈ రెమెడీస్ పాటించాలట

Remedies: ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరపడలేకపోతున్నారా..? అయితే ఈ రెమెడీస్ పాటించాలట
Advertisement

Remedies: జీవితంలో ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం దక్కక లేదా స్థిరత్వం (Stability) లేక ఇబ్బంది పడేవారికి జ్యోతిష్య, వాస్తు మరియు ధర్మ శాస్త్రాలు కొన్ని ప్రత్యేక మార్గాలను సూచిస్తున్నాయట. వృత్తి, వ్యాపార లేదా వ్యక్తిగత జీవితంలో నిలకడ సాధించడానికి శాస్త్రం సూచించే ఈ రెమెడీస్ పాటించాలని పండితులు సూచిస్తున్నారు.

నవగ్రహ ఆరాధన – శని, రాహు గ్రహాల శాంతి: జీవితంలో స్థిరత్వం లేకపోవడానికి ప్రధానంగా జాతకంలో శని లేదా రాహు గ్రహాల ప్రభావం ఉండవచ్చని పండితులు అంటున్నారు. అందుకోసం ప్రతి శనివారం నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలట లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలట. ఇక అకస్మాత్తుగా అడ్డంకులు వస్తుంటే ప్రతిరోజూ దుర్గా చాలీసా పఠించడం లేదా రాహు కాలంలో దుర్గాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.

Advertisement

గృహ వాస్తు మరియు నైరుతి మూల (South-West): వాస్తు ప్రకారం నైరుతి (South-West) దిశ స్థిరత్వానికి చిహ్నమట. మీ ఇంట్లో నైరుతి మూల ఖాళీగా ఉండకూడదట. అక్కడ బరువైన వస్తువులను ఉంచాలట. ఈ మూలలో పొరపాటున కూడా నీటి నిల్వలు (Tanks) లేదా గోతులు ఉండకుండా చూసుకోవాలట. అక్కడ ఒక పసుపు రంగు బల్బును వెలిగించడం వల్ల ఆ దిశకు బలం చేకూరుతుందట.

శ్రీ మహాలక్ష్మీ ఆరాధన: ఎరికైనా జీవితంలో ఆర్థిక స్థిరత్వం కావాలనుకుంటే అందుకోసం లక్ష్మీదేవి అనుగ్రహం అవసరమట. ప్రతి శుక్రవారం ఇంట్లో కనకధారా స్తోత్రం లేదా అష్టలక్ష్మి స్తోత్రం పఠించాలట. ముఖ్యంగా శ్రీ సూక్తం పారాయణం చేయడం వల్ల ఆదాయ మార్గాల్లో ఉన్న అడ్డంకులు తొలగి, సంపాదన నిలకడగా ఉంటుందట.

Advertisement

పక్షులకు మరియు జంతువులకు సేవ: కర్మ దోషాల వల్ల కలిగే అశాంతిని తొలగించుకోవడానికి ఇది అద్భుతమైన మార్గమట. ప్రతిరోజూ ఉదయం పక్షులకు ఏడు రకాల ధాన్యాలను (సప్త ధాన్యాలు) ఆహారంగా వేయాలట. వీలైతే నల్ల కుక్కకు శనివారం రోజున ఆహారం పెట్టాలట. ఇది వృత్తిపరమైన ఇబ్బందులను తొలగిస్తుందట.

నిర్ణయాల్లో నిలకడ కోసం: మనస్సు నిలకడగా లేకపోవడం వల్ల కూడా చేసే పనులు మధ్యలో ఆగిపోతుంటాయట. అందుకోసం సోమవారం రోజున శివుడికి పాలాభిషేకం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుందట.. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుందట. ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందట.

ఆచరించాల్సిన నియమాలు: అమావాస్య రోజున పితృ దేవతలను తలుచుకుని పేదలకు అన్నదానం చేయడం వల్ల వంశపారంపర్యంగా వచ్చే అడ్డంకులు తొలగిపోతాయట.

అయితే ఏదైనా పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో కనీసం 41 రోజుల పాటు నిరంతరాయంగా పాటించాలట. దైవబలంతో పాటు మీ ఆత్మవిశ్వాసం కూడా తోడైతే విజయం తప్పక వరిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ లక్షణాలు మీకుంటే మీ జీవితం సర్వ నాశనం అవుతుందట – ఇంకా చాణక్య నీతి ఏం చెప్తుందంటే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×