E-Paper
Advertisement

అందమైన నీలగిరి.. నల్లగొండగా ఎలా మారింది? చరిత్ర చెప్పే అసలు నిజం ఇదే!

అందమైన నీలగిరి.. నల్లగొండగా ఎలా మారింది? చరిత్ర చెప్పే అసలు నిజం ఇదే!
Advertisement

Neelagiri to Nalgonda: చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలను ఒడిసిపట్టుకుని తెలంగాణ హృదయంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జిల్లా. తెలంగాణా సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ముందుండి నడిచిన జిల్లా. అద్భుతమైన సాహితీవేత్తలను, ఎంతోమంది ప్రజా నాయకులను ప్రపంచానికి పరిచయం చేసిన జిల్లా. అదే నల్గొండ జిల్లా. వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం.. పేరులోనూ వైవిధ్యాన్నిచాటుకుంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు  ‘నీలగిరి’ అని పిలిచేవారు. అలా పిలిచేందుకు ఓ ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. తొలుత శాతవాహనులు, ఆ తర్వాత రాజపుత్రుల కాలంలో ఈ ప్రాంతానికి ‘నీలగిరి’ అని పెట్టారు. ఇందుకు కారణం చుట్టూ ఉన్న సహజ సిద్ధమైన కొండలు. నీలమేఘ వర్గంలో కనిపించే ఈ కొండల నడుమ ఈ అందమైన పట్టణం ఉండటంతో ‘నీలగిరి’గా వ్యవహరించేవారు.

నీలగిరి నల్లగొండగా ఎలా మారింది?

కాలం మారేకొద్దీ రాజ్యాలు మారాయి. పాలకులు మారారు. అలాగే ఈ ప్రాంతం పేరు కూడా మారుతూ వచ్చింది. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానుల పాలన ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతం కొత్త గుర్తింపును సంతరించుకుంది. బహమనీ సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ షా ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, ఇక్కడి నల్లటి రాతి కొండలను దృష్టిలో పెట్టుకుని ‘నల్లగొండ’ అనే పేరును ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత నిజాం పాలనలో ఉర్దూ, పర్షియన్ భాషల ప్రభావంతో ‘నల్లగొండ’ పేరు క్రమంగా ‘నల్గొండ’గా మారింది. బ్రిటీష్ కాలం నాటి అధికారిక పత్రాల్లో కూడా ‘Nalgonda’ అనే పేరే ఉండేది. నెమ్మదిగా అదే పేరు స్థిరపడిపోయింది.

పేరు మారినా.. ప్రజల్లో నీలగిరి గానే..

Advertisement

పేరు మారినా.. ‘నీలగిరి’ అనే పాత గుర్తింపు మాత్రం ప్రజల మనసుల్లో ఇప్పటికీ నిలిచే ఉంది. ఇప్పటికీ నల్గొండలోని కొన్ని విద్యా సంస్థలు, ఉద్యానవనాలు, పత్రికలు ‘నీలగిరి’ పేరునే కొనసాగిస్తున్నాయి. ఆ చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పాత తరం స్థానికులు కూడా ప్రేమతో నల్గొండను ‘నీలగిరి’ అని సంబోధిస్తూనే ఉన్నారు.

Read Also: హైదరాబాద్ నుంచి కార్లలో వచ్చి నీళ్ల కోసం క్యూ.. ఏంటీ.. ఈ నల్లగొండ బావి ప్రత్యేకత?

ఆధునిక నల్గొండ గురించి..

Advertisement

ఆధునిక నల్గొండ అద్భుతమైన ప్రకృతి సంపదతో అలలారుతోంది. సుమారు 2,449.79 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ జిల్లా పలు నదులతో సుసంపన్నమైనదిగా కొనసాగుతోంది. దక్షిణ సరిహద్దు వెంట సుమారు 85 కిలోమీటర్ల మేర కృష్ణా నది ప్రవహిస్తూ వ్యవసాయానికి జీవనాడిగా నిలుస్తోంది. జిల్లా సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. వ్యవసాయం నల్గొండ ప్రజల ప్రధాన జీవనాధారంగా కొనసాగుతోంది. జిల్లాలో వరి, జొన్న, సజ్జలు, వేరుశెనగ, కందులు, ఆముదం, పత్తి పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఉద్యానవన పంటల్లో బత్తాయి. మామిడి ఎక్కువగా సాగు అవుతోంది. సారవంతమైన నేలలు, నదుల నీటి లభ్యత వల్ల ఈ ప్రాంతం వ్యవసాయపరంగా మంచి అభివృద్ధి సాధించింది.

పరిపాలనా పరంగా నల్గొండ జిల్లా మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది. నల్గొండ, మిర్యాలగూడ ప్రధాన డివిజన్లుగా ఉండగా, దేవరకొండ సబ్ డివిజన్‌గా కొనసాగుతోంది. ఈ జిల్లా చరిత్ర, ప్రకృతి, వ్యవసాయం, సంస్కృతి అన్నింటినీ సమానంగా మేళవించుకున్న అరుదైన ప్రాంతంగా నిలిచింది.  ప్రకృతి అందాలు, గొప్ప వారసత్వం, వ్యవసాయ సంపద, చారిత్రక గుర్తింపుతో నల్గొండ తెలంగాణలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.

Read Also: నల్లగొండలో ఆర్జాలబావి.. ఈ పేరు వెనుక ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉందా?

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×