E-Paper
Advertisement

పోలీసులను వీడియో తీయెుచ్చా? ఫోన్ లాక్కునే హక్కు వారికి లేదా? చట్టం ఏం చెబుతోంది?

పోలీసులను వీడియో తీయెుచ్చా? ఫోన్ లాక్కునే హక్కు వారికి లేదా? చట్టం ఏం చెబుతోంది?
Advertisement

Police Recording: ఈ రోజుల్లో పౌరులు, పోలీసులకు మధ్య వాగ్వాదాలకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట నిత్యం వైరల్ అవుతున్నాయి. పోలీసులు దురుసుగా ప్రవర్తించారనో, లంచం తీసుకుంటున్నారనో అని ఆరోపిస్తూ సామాన్యులు తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సహజంగానే అందరిలోనూ ఓ ప్రశ్న తలెత్తుతోంది. కాబట్టి అసలు పోలీసులను వీడియో తీయడం చట్టబద్దమేనా? భారతీయ చట్టాలు ఇందుకు అనుకూలమా? వ్యతిరేకమా? న్యాయస్థాన తీర్పులు ఎలా ఉన్నాయి? అన్నది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చట్టం ఏం చెబుతోంది?

పబ్లిక్ ప్లేస్‌లలో విధుల్లో ఉన్న పోలీసులను రికార్డ్ చేయడాన్ని నిషేధిస్తూ దేశంలో ఎలాంటి ప్రత్యేక చట్టం లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం పౌరులకు లభించిన ‘వాక్ స్వాతంత్రం, భావవ్యక్తీకరణ’ హక్కుల్లో భాగంగానే సమాచారాన్ని సేకరించడం, పంచుకోవడం కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు వారిని రికార్డ్ చేయడం చట్టవిరుద్ధం కాదు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత చాలా ముఖ్యమని.. పోలీసుల ప్రవర్తనకు సంబంధించిన పలు కేసుల్లో పౌరులు తీసిన వీడియోలే కీలక ఆధారాలుగా నిలిచాయని కోర్టులు సైతం పలు తీర్పుల్లో స్పష్టం చేశాయి.

అడ్డుకునే హక్కు పోలీసులకు లేదా?

Advertisement

అయితే సందర్భాన్ని బట్టి ఫోన్ రికార్డును అడ్డుకునే హక్కు పోలీసులకు ఉంటుందని చట్టం చెబుతోంది. రికార్డ్ చేసే వీడియో వల్ల కేసు దర్యాప్తునకు, సోదాలకు, నిందితుడి ప్రైవసీ, బాధితుల గోప్యతకు భంగం కలుగుతుందని భావించినప్పుడు పోలీసులకు అడ్డుకునే అధికారం ఉంటుంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 221 ప్రకారం విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే 3 నెలల జైలు శిక్ష, రూ. 2,500 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

ఫోన్ సీజ్, వీడియోలు డిలీట్ సాధ్యమేనా?

మరోవైపు భయపెట్టడానికో, తాము వీడియోలో పడ్డామనో చెప్పి పౌరుల నుంచి ఇష్టానుసారంగా ఫోన్ లాక్కునే అధికారం పోలీసులకు లేదు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 106 ప్రకారం.. ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం దర్యాప్తుకు అత్యంత అవసరమని భావిస్తేనే పోలీసులు దాన్ని సీజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కూడా అధికారి దానికి గల కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేసి.. మేజిస్ట్రేట్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. అటు చట్టబద్ధంగా రికార్డ్ చేసిన వీడియోను బలవంతంగా డిలీట్ చేయించే అధికారం పోలీసులకు ఉండదు. చట్టపరమైన ప్రక్రియ లేకుండా సాక్ష్యాలను తుడిచిపెట్టేయడం చట్టవిరుద్ధం.

కోర్టులు తీర్పులు ఎలా ఉన్నాయి?

Advertisement

పోలీసులతో పాటు పోలీస్ స్టేషన్లను సైతం నిఘా నీడలోకి తెచ్చేలా 2020లోనే సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. కస్టడీ హింసను నిరోధించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఆడియోతో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేసింది. ‘పరంవీర్ సింగ్ సైనీ vs బల్జీత్ సింగ్’ కేసులో సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది. ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని వివిధ కేసుల విచారణ సందర్భంగానూ న్యాయస్థానం రాష్ట్రాలకు గుర్తు చేస్తూనే వస్తోంది.

పోలీసు స్టేషన్‌లో వీడియో తీయెుచ్చా?

బహిరంగ ప్రదేశాల తరహాలోనే పోలీస్ స్టేషన్ లోపల సైతం సామాన్యులకు వీడియో తీసే హక్కు ఉందని గత తీర్పులు స్పష్టం చేస్తున్నారు. ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ – 1923’ కింద పోలీసు స్టేషన్ లో వీడియో తీయడం నేరం కాదని 2024 సెప్టెంబర్ లో బొంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. పోలీసు స్టేషన్ నిషేధిత ప్రాంతం కాదని పేర్కొంది. అంతకుముందు 2022లో పోలీస్ స్టేషన్‌ను బయటి నుండి ఫోటో తీసినందుకు ఒక వ్యక్తిపై కేసు పెట్టిన పోలీసులకు బొంబాయి హైకోర్టు రూ. 25,000 జరిమానా విధించింది. చట్టాన్ని పౌరులను వేధించడానికి వాడుకోవడం తగదని మందలించింది.

కేరళలో ప్రత్యేక చట్టం

ఇదిలా ఉంటే పోలీసులను ఫోన్ లో రికార్డు చేసే హక్కును ప్రజలకు చట్టబద్దంగా కల్పిస్తూ.. కేరళ రాష్ట్రం ప్రత్యేక చట్టం చేసింది. కేరళ పోలీస్ యాక్ట్, 2011లోని సెక్షన్ 33(2) ప్రకారం.. పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రదేశాలలో పోలీసులు తీసుకునే చర్యలను పౌరులు రికార్డ్ చేయవచ్చు. దీనిని అడ్డుకోవడానికి వీల్లేదని ఆ నిబంధన స్పష్టంగా పేర్కొంది. అయితే పోలీసుల విధులకు ఆటంకం కలగకుండా పౌరులు నడుచుకోవాల్సిన బాధ్యతను సైతం ఈ చట్టంలో హైలెట్ చేశారు. ప్రస్తుతం దేశంలోని కేరళ రాష్ట్రంలో మాత్రం ఇలాంటి ప్రత్యేక చట్టం ఉండటం విశేషం.

Also Read: భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

నెట్టింట అప్‌లోడ్ చేయవచ్చా?

పోలీసులను రికార్డ్ చేసిన అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేసే వీడియో ఎవరినైనా కించపరిచేలా, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా, చట్టప్రకారం రక్షణ ఉన్న బాధితుల గుర్తింపును బయటపెట్టేలా ఉంటే చట్టపరంగా చర్యలు తప్పవు. అలాగే వీడియోలను ఎడిట్ చేసి.. తప్పుడు సమాచారంతో షేర్ చేస్తే క్రిమినల్ చట్టాల కింద శిక్షార్హులవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Related News

యాపిల్ మ్యాక్‌బుక్‌లకు గట్టి పోటీ.. ఒక్క ఛార్జ్‌తో 22 గంటల బ్యాటరీ!

ఇక పిల్లల Meta AI చాట్స్‌పై నిఘా.. ఆత్మహత్య ఆలోచనలు వస్తే పేరెంట్స్‌కు అర్జెంట్ నోటిఫికేషన్!

ఇంట్లోనే బేకరీ స్టైల్ కేకులు! బేకింగ్, డిఫ్రాస్టింగ్ కోసం 5 బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్లు

ఏఐ సెన్సార్లు, స్టీమ్ వాష్..ఇంతకంటే బెస్ట్ వాషింగ్ మెషీన్లు ఉండవేమో!

కిచెన్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే.. టాప్ 5 సైలెంట్ చిమ్నీలు

అమెజాన్‌లో టాప్ 5 లివ్‌ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్స్.. మీ ఇంటికి ఏది బెస్ట్?

45W ఫాస్ట్ ఛార్జింగ్, 8000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి Realme C100x ఎంట్రీ.. టెక్ లవర్స్ ఫుల్ హ్యాపీ!

Big Stories

Advertisement
×