E-Paper
Advertisement

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?
Advertisement

Vastu Tips: నేటి తరం యువత తీరు ఎలా ఉందంటే.. ఉదయం కళ్లు తెరిచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలో లేకపోతే అన్నం కూడా తినని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా స్క్రోలింగ్, మెసేజ్‌లు చూసుకోవడం, ఈ-మెయిల్స్ చెక్ చేయడం లాంటివి మనకు తెలియకుండానే అలవాటుగా మారిపోయాయి. చివరకు బాత్‌రూమ్‌లోకి వెళ్లేటప్పుడు కూడా ఫోన్‌ను వెంట తీసుకెళ్లడం చాలా మందికి కామన్‌ అయిపోయింది. అయితే, ఈ చిన్న అలవాటు మన జీవితంపై ఎంతటి ప్రతికూల ప్రభావం చూపుతుందో ప్రముఖ వాస్తు నిపుణురాలు, జ్యోతిష్యురాలు జై మదాన్ ఒక వీడియో ద్వారా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

వాస్తు ప్రకారం బాత్‌రూమ్ అంటే?

బాత్‌రూమ్ అనేది శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి, మలినాలను వదిలించుకోవడానికి నిర్దేశించిన స్థలం. అది ఎంత అందంగా, ఖరీదైనదిగా ఉన్నప్పటికీ.. వాస్తు ప్రకారం అక్కడ ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. అది కేవలం విసర్జనకు, శుద్ధికి సంబంధించిన చోటు మాత్రమే. అలాంటి ప్రదేశంలో కూర్చుని ఫోన్ చూడటం అస్సలు మంచిది కాదని వాస్తు నిపుణురాలు స్పష్టం చేశారు.

Advertisement

Also Read: టాయిలెట్ క్లీనర్లతో ప్రాణాంతక ముప్పా? ప్రతి ఇంట్లోనూ జరిగే అతిపెద్ద తప్పు ఇదే!

ఉదయాన్నే ఆ శక్తిని కోల్పోవద్దు:

చాలామంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్ పట్టుకుని బాత్‌రూమ్‌లోకి వెళ్తారు. అక్కడే కూర్చుని ఆఫీస్ మెసేజ్‌లు, మెయిల్స్ చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల సృజనాత్మకత, ఆలోచనా శక్తి తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు. రోజంతా ఉత్సాహంగా పని చేయాల్సిమనలోనిన శక్తిని, మంచి అవకాశాలను ఉదయాన్నే అక్కడ వృథా చేసినట్లు అవుతుంది. పైగా ఫోన్ చూస్తూ ఉండటం వల్ల అవసరమైన సమయం కంటే ఎక్కువ సేపు అక్కడే గడపాల్సి వస్తుంది.

ఫోన్ అంటే కేవలం ఫోన్ కాదు:

Advertisement

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం మాట్లాడుకునే సాధనం కాదు. అది మన పర్సు లేదా వాలెట్‌తో సమానం. ఎందుకంటే డబ్బుల లావాదేవీలన్నీ దాని ద్వారానే జరుగుతున్నాయి. వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక విషయాలన్నీ ఫోన్‌తోనే ముడిపడి ఉన్నాయి. మనం డబ్బులను బాత్‌రూమ్‌లో పెట్టడానికి ఇష్టపడం కదా, మరి అంతటి విలువైన ఫోన్‌ను అక్కడికి తీసుకెళ్లడం మంచిది కాదు. కాబట్టి టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడైనా ఫోన్‌ను దూరంగా పెట్టడం వల్ల మనలోని సానుకూల శక్తి, మంచి అవకాశాలు చేజారిపోకుండా ఉంటాయట.

Also Read: వ్యాక్సింగ్, షేవింగ్ లేదా లేజర్? చర్మానికి ఏది సేఫ్.. డెర్మటాలజిస్ట్ రేటింగ్స్ ఇవే!

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×