Desired People: మీ మనసుకు ఇష్టమైన వాళ్లు మిమ్మల్ని తలుచుకుంటే మీకు ఎలా తెలుస్తుందో తెలుసా..? మీ గురించి వాళ్లు చేసే ఆలోచనలే మీ మనస్సును హఠాత్తుగా తాకుతాయట. మీలో కలిగే కొన్ని భావాలే మీ ఇష్టమైన వాళ్లు మిమ్మల్ని గుర్తు చేసుకున్నారనడానికి నిదర్శనంగా బావించాలట.
మనసుకు ఇష్టమైన వారు మన గురించి ఆలోచిస్తున్నప్పుడు లేదా మనల్ని తలుచుకుంటున్నప్పుడు మన శరీరంలో మరియు మనస్సులో కొన్ని సహజమైన మార్పులు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం మరియు సైకాలజీ (Psychology) లో కొన్ని నమ్మకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
అకస్మాత్తుగా వారు జ్ఞాపకం రావడం: మీరు ఏదో పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు.. అప్పటి వరకు ఆ వ్యక్తి గురించి అస్సలు ఆలోచించకపోయినా.. ఒక్కసారిగా వారు గుర్తొస్తే, అవతలి వ్యక్తి మిమ్మల్ని బలంగా తలుచుకుంటున్నారని ఒక నమ్మకం. మన ఆలోచనలు తరంగాల రూపంలో ఒకరికొకరు అనుసంధానమై ఉంటాయని (Telepathy) అంటారు.
ఎడతెగని వెక్కిళ్లు (Hiccups): పెద్దల కాలం నుండి ఉన్న బలమైన నమ్మకం ఏమిటంటే.. తిండి తినేటప్పుడు కాకుండా, సాధారణ సమయంలో మీకు అకస్మాత్తుగా వెక్కిళ్లు వస్తే ఎవరో మిమ్మల్ని గట్టిగా తలుచుకుంటున్నారని అర్థం. ముఖ్యంగా మీకు ఇష్టమైన వాళ్లు మీ గురించి ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఇలా జరుగుతుందని చెబుతుంటారు.
కనురెప్పలు అదరడం (Eye Twitching): కంటి రెప్పలు అదరడం వెనుక కూడా కొన్ని సంకేతాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. పురుషులకు కుడి కన్ను, స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే అది శుభసూచకమని, ఎవరో మీకు ఇష్టమైన వారు మీ గురించి సానుకూలంగా (Positive) ఆలోచిస్తున్నారని అనుకోవాలట.
మీ మనసుకు నచ్చిన వారు కలలోకి రావడం: ఒక వ్యక్తి పదే పదే మీ కలలోకి వస్తున్నారంటే, మీరు వారి గురించి ఆలోచించడం ఒక కారణమైతే.. అవతలి వ్యక్తి కూడా మిమ్మల్ని కలవాలని లేదా మీతో మాట్లాడాలని బలంగా కోరుకుంటున్నారని అర్థమట.
కారణం లేకుండా ముఖంలో చిరునవ్వు: మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు మీ ప్రమేయం లేకుండానే ముఖంపై ఒక చిన్న చిరునవ్వు మెరిసిందంటే, మీ అంతరాత్మకు అవతలి వ్యక్తి పంపే సానుకూల తరంగాలు అందుతున్నాయని అర్థమట.
ఆకస్మిక భావోద్వేగం: కొన్నిసార్లు కారణం లేకుండానే మనస్సు ఏదో అలజడికి లోనవ్వడం లేదా ఒక్కసారిగా సంతోషం కలగడం జరుగుతుంది. ఇది అవతలి వ్యక్తి మిమ్మల్ని ఎంత గాఢంగా తలుచుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందట. దీనినే సైకాలజీలో ఎనర్జీ కనెక్షన్ అని పిలుస్తారట.
ఇవన్నీ కేవలం నమ్మకాలు మరియు అనుభూతులు మాత్రమే. నిజంగా వారు మిమ్మల్ని తలుచుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి ఉన్న సులువైన మార్గం.. ఒక్కసారి వారికి ఫోన్ చేసి పలకరించడం! మీ మనసులో వారి జ్ఞాపకం వచ్చిందంటే, బహుశా వారి మనసులో కూడా అదే భావం ఉండి ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.