E-Paper
Advertisement

కుక్క తోక వంకరంటారు.. అసలు తోకే లేకపోతే? ప్రపంచంలోనే ఈ వింతైన డాగ్స్ గురించి తెలుసా?

కుక్క తోక వంకరంటారు.. అసలు తోకే లేకపోతే? ప్రపంచంలోనే ఈ వింతైన డాగ్స్ గురించి తెలుసా?
Advertisement

Tailless Dogs: సాధారణంగా తోక లేని కుక్కలను అస్సలు ఊహించలేం. కానీ అలాంటివి ఈ భూమ్మీద ఉన్నాయంటే చాలా మందికి వింతగా అనిపించవచ్చు. ఏ జాతి కుక్కలు అయినా తమ సంతోషాన్ని, భావోద్వేగాలను తోక ఊపుతూ ప్రధానంగా వ్యక్తపరుస్తాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన జాతులకు పుట్టుకతోనే తోకలు ఉండవట. ఒకవేళ ఉన్నా కూడా అది చాలా చిన్నగా ఉంటాయట. పైగా ఇతర కుక్కలతో పోలిస్తే.. వీటి బరువు, పొడవు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి తోక లేని కుక్కల జాతులు ఈ ప్రపంచంలో 6 ఉన్నాయి. వాటి గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆస్ట్రేలియన్ స్టంపీ టైల్ క్యాటిల్ డాగ్

ప్రధానంగా ఆస్ట్రేలియాలో కనిపించే ఈ కుక్కలు చూడటానికి చాలా గంభీరంగా ఉంటాయి. పుట్టుకతోనే వీటికి తోక ఉండదు. ఒకవేళ ఉన్నా అది కేవలం 10 సెంటీమీటర్ల కంటే తక్కువ పొడవు మాత్రమే ఉంటుంది. పశువులను కాపలా కాయడంలో ఇవి చాలా చురుగ్గా పనిచేస్తాయట. వీటి అద్భుతమైన పనితీరు, యజమాని పట్ల చూపించే విశ్వాసం నెక్స్ట్ లెవల్లో ఉంటాయని డాగ్ లవర్స్ చెబుతుంటారు.

ఫ్రెంచ్ బుల్‌డాగ్

Advertisement

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్న స్మాల్ సైజ్ కుక్కలలో ఫ్రెంచ్ బుల్‌డాగ్ ఒకటి. వీటికి తోక చాలా చిన్నగా, కాస్త వంకరగా ఉంటుంది. చూసేందుకు అసలు తోకే లేనట్లు కనిపిస్తుంది. చదునైన ముఖం, పెద్ద చెవులతో ఉండే ఈ కుక్కలు.. అపార్ట్‌మెంట్లలో పెంచుకోవడానికి ఎంతో అనువుగా ఉంటాయి.

బోస్టన్ టెరియర్

‘అమెరికన్ జెంటిల్‌మన్’ అని పిలవబడే బోస్టన్ టెరియర్‌లకు కూడా తోకలు ఉండవు. ఒకవేళ ఉన్నా అది చాలా చిన్నగా ఉంటుంది. నలుపు, తెలుపు రంగుల కలయికతో కోటు వేసుకున్నట్లు కనిపించే ఈ కుక్కలు ఎంతో విశ్వాసంతో, చురుగ్గా ఉంటాయి. పిల్లలతో ఇవి చాలా సులువుగా కలిసిపోతాయి.

పెంబ్రోక్ వెల్ష్ కోర్గి

Advertisement

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-II కి ఎంతో ఇష్టమైన ఈ జాతి కుక్కలకు సైతం తోకలు ఉండవు. చాలా మంది వీటిని తోకలు కత్తిరించిన కుక్కలుగా భావిస్తారు కానీ, జన్యుపరమైన కారణాల వల్ల ఇవి తోక లేకుండానే జన్మిస్తాయి. వీటి పొట్టి కాళ్లు, నక్క లాంటి ముఖం అందరినీ ఆకట్టుకుంటాయి.

ఇంగ్లీష్ బుల్‌డాగ్

దృఢమైన బాడీ, ముడతలు పడిన ముఖంతో ఉండే ఇంగ్లీష్ బుల్‌డాగ్‌లకు కూడా సహజంగానే తోకలు చాలా చిన్నగా ఉంటాయి. కొన్నింట్లో అయితే అస్సలకే ఉండవట. చూడటానికి గంభీరంగా ఉన్నప్పటికీ ఇవి చాలా ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువ వ్యాయామం అవసరం లేని ఈ జాతి కుక్కలు సోఫాలపై విశ్రాంతి తీసుకోవడానికి అమితంగా ఇష్టపడతాయి.

Also Read: ఇస్రోలో సంక్షోభం.. 120 శాస్త్రవేత్తలు రాజీనామా, రంగంలోకి కేంద్రం, కీలక మిషన్ల మాటేంటి?

బ్రిటనీ స్పానియల్

ఇవి వేట కుక్కల విభాగంలోకి వస్తాయి. కొన్ని బ్రిటనీ స్పానియల్ కుక్కలు పుట్టుకతోనే తోక లేకుండా జన్మిస్తాయి. మరికొన్నింటికి చాలా చిన్న తోక ఉంటుంది. ఎంతో శక్తివంతమైన, చురుకైన ఈ కుక్కలు.. నిత్యం ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతాయి. మనుషులతో స్నేహంగా ఉండటంలో ఇవి ముందుంటాయి.

Also Read: వాన చినుకుల్లో.. ప్రకృతి అందాలు.. ఈ 6 హిల్ స్టేషన్లు మీ కోసమే!

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×