E-Paper
Advertisement

గోర్లు లేకుండా మనిషి బతకలేడా? అవి పెరగడం ఆపేస్తే అంతే సంగతులా? నమ్మలేని నిజాలు!

గోర్లు లేకుండా మనిషి బతకలేడా? అవి పెరగడం ఆపేస్తే అంతే సంగతులా? నమ్మలేని నిజాలు!
Advertisement

Human Nails: మానవ శరీరంలో గోర్లు కేవలం అందానికి, కత్తిరించుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయని చాలామంది అనుకుంటారు. కానీ ప్రకృతి మన శరీరంలో సృష్టించిన ప్రతి భాగం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఒకవేళ మనిషికి అసలు గోర్లే లేకపోతే ఏమవుతుంది? అవి పెరగడం పూర్తిగా ఆగిపోతే ప్రాణాలకేమైనా ప్రమాదమా? అన్న ప్రశ్నలకు సమాధానాలను నిపుణులు అన్వేషించగా.. ఎన్నో నమ్మశక్యం కాని ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

గోర్లు లేకపోతే మనిషి బతకలేడా?

గోర్లు లేకపోయిన మానవ జాతి బతకగలదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇది ప్రాణాంతకమైన సమస్య ఏమీ కాదని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలో ‘అనోనిచియా కాంప్లిటా’ (Anonychia congenita) అనే అరుదైన జన్యుపరమైన లోపంతో పుట్టే కొందరికి పుట్టుకతోనే గోర్లు ఉండవు. వారు సాధారణ జీవితాన్ని గడపగలరు. అయితే గోర్లు లేకపోవడం వల్ల ప్రాణం పోకపోయినా నిత్య జీవితంలో ఎదురయ్యే నరకం అంతా ఇంతా కాదని మాత్రం నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోర్లు లేని జీవితం ఊహించలేనంత కష్టంగా మారుతుందని పేర్కొంటున్నారు.

పెరగడం ఆగిపోతే ఏమవుతుంది?

Advertisement

సాధారణంగా గోర్లు కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతాయి. ఇవి నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ శరీరంలో గోర్లు పెరగడం పూర్తిగా ఆగిపోతే అది ఒక తీవ్రమైన అనారోగ్య హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది. తీవ్రమైన పోషకాహార లోపం, థైరాయిడ్ సమస్యలు, గుండె – ఊపిరితిత్తుల వ్యాధులు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే గోర్ల పెరుగుదల ఆగిపోతుంది. అంటే గోర్లు పెరగకపోవడం నేరుగా ప్రాణం తీయకపోయినా లోపల ఏదో పెద్ద ప్రాణాపాయ వ్యాధి దాగి ఉందనడానికి అది బలమైన సంకేతం.

రోజువారీ పనులు.. నరకప్రాయం

వేలి చివరలను రక్షించాలనే ప్రధాన లక్ష్యంతో గోర్లు పనిచేస్తుంటాయి. మనిషి వేళ్ల చివరల్లో వేలాది సున్నితమైన నరాలు (Nerve endings) ఉంటాయి. గోర్లు లేకపోతే ఈ నరాలు నేరుగా బయటి వాతావరణానికి ఎఫెక్ట్ అవుతాయి. ఫలితంగా ఒక వస్తువును గట్టిగా పట్టుకోవాలన్నా, పెన్నుతో రాయాలన్నా, కీబోర్డ్ టైప్ చేయాలన్నా విపరీతమైన నొప్పి పుడుతుంది. సూది వంటి చిన్న వస్తువులను కింద నుంచి పైకి తీయడం అసాధ్యంగా మారుతుంది. చివరికి దురద పెడితే గీరుకోవడానికి కూడా చేతులు సహకరించవు.

Advertisement

Also Read: Cat Crosses Path: పిల్లి ఎదురుగా వస్తే.. వెనక్కి వెళ్లిపోతాం ఎందుకు? దాని వెనుక సీక్రెట్ అదే

ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం

గోర్లు కేవలం కవచాలుగా మాత్రమే కాకుండా హానికరమైన ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ లు చర్మంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే గోడలుగా ఇవి పనిచేస్తుంటాయి. గోర్లు పెరగడం ఆగిపోయినా, ఊడిపోయినా.. ఆ ఖాళీ ప్రదేశంలో తేమ చేరి ఇన్ఫెక్షన్లు చాలా వేగంగా వ్యాపిస్తాయి. ఇది పారొనీచియా (Paronychia) వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీసి వేళ్లు కుళ్లిపోయేలా చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెుత్తంగా చెప్పాలంటే గోర్లు లేకపోయినా మనిషి జీవిస్తాడు గానీ.. అవి లేని జీవితం ప్రతి క్షణం నొప్పితో, రోగాలతో నరకప్రాయంగా మారుతుందని చెప్పవచ్చు.

Also Read: లాగ్స్ లేవు.. స్లో అవ్వవు.. సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఎస్‌ఎస్‌డీ లాప్‌టాప్స్!

Related News

వర్షాకాలంలో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తీవ్రం.. ఇంట్లోనే ఈ డ్రింక్స్‌తో ఉపశమనం

చిన్నప్పుడు ఈ 5 అలవాట్లు ఉన్న పిల్లల్లు తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారిని పట్టించుకోరు

బరువు తగ్గాలంటే ఆకలితో ఉండాల్సిన పనిలేదు.. ఈ 4 పనులు చేయండి చాలు!

అన్న వద్ద డబ్బు గుంజడమే పని.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సోదరుల చేత ఖర్చు చేయించడంలో దిట్ట

ప్రతి రోజు మేకప్ తొలగించడానికి ఇబ్బందిపడుతున్నారా? నిమిషాల్లో మీ పని పూర్తి చేసే నేచురల్ క్లీన్సింగ్ బామ్ ఇలా చేసుకోండి

పిల్లలు తరచూ అనారోగ్యానికి ఎందుకు గురవుతారు.. డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

స్వైన్ ఫ్లూ వస్తే పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

బెడ్‌పై పడుకోగానే నిద్ర రావడం లేదా? గంటల తరబడి ఆలోచిస్తూ ఉన్నారా? పరిష్కారం ఇదిగో

Big Stories

Advertisement
×