Numerology: మీ మొబైల్ నెంబర్‌లో ఆ నెంబర్స్ ఉంటే ఇక మీకు అష్ట దరిద్రాలు చుట్టుకున్నట్టేనట. మీరు ఎంత కష్టపడినా మీ జీవితంలో గ్రోత్ అనేది అసలు ఉండదట. చాలా మంది ఫ్యాన్సీ నెంబర్స్ అని తీసుకుంటుంటారు. కానీ ఆ ఫ్యాన్సీ నెంబర్స్ మీ వ్యక్తిగత జాతకానికి ఎంత వరకు కలిసి వస్తాయన్నది కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.
మొబైల్ నంబర్ల విషయంలో న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) ప్రకారం కొన్ని అంకెలు లేదా అంకెల కలయికలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని న్యూమరాలజిస్టులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి లేదా వృత్తిలో ఆటంకాలు కలిగించే నంబర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొబైల్ నెంబర్ లో సున్నా ఉండటం: మీ ఫోన్ నెంబర్ లో ఎక్కువగా సున్నా ఉండటం. కానీ మొబైల్ నంబర్ చివరలో సున్నాలు (0) ఉండటం కానీ మంచిది కాదని న్యూమరాలజీ చెబుతుందట. ముఖ్యంగా నంబర్ చివరలో మూడు సున్నాలు, రెండు సున్నాలు ఉంటే అది మీరు చేసే ప్రయత్నాల ఫలితాన్ని శూన్యం చేస్తుందని లేదా ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. నంబర్ మధ్యలో ఒకటి లేదా రెండు సున్నాలు ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయినా, చివరలో మాత్రం అసలు ఉండకూడదని సూచిస్తున్నారు.
ఎనిమిది, నాలుగు సంఖ్యల కలయిక: (8,4): ఎనిమిది నెంబర్ శని గ్రహానికి చెందింది. ఇది కష్టపడే స్వభావాన్ని సూచిస్తుంది. కానీ ఈ అంకె మొబైల్ నంబర్‌లో వరుసగా (ఉదాహరణకు 888) ఉంటే జీవితంలో విపరీతమైన ఆలస్యం.. మరియు కష్టాలు ఎదురవుతాయని.. అలాగే 4 రాహువుకు సంబంధించింది అని 4 సంఖ్య అకస్మాత్తుగా వచ్చే సమస్యలను సూచిస్తుందని చెప్తున్నారు. దీంతో మీ మొబైల్ నెంబర్‌లో ఎనిమిది, నాలుగు పక్కపక్కనే (8, 4) ఉండటం అంత మంచిది కాదని దీని వల్ల ఆర్థిక పరమైన చిక్కులు లేదా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
వరుసగా రెండు, నాలుగు, ఎనిమిది నంబర్లు ఉండటం (2, 4, 8): కొన్ని ప్రత్యేక కలయికలు అంటే 24, 42, 48, 84 వంటి సంఖ్యలు మొబైల్ నంబర్‌లో ఉంటే అవి మానసిక అశాంతిని లేదా వ్యాపారంలో నష్టాలను కలిగిస్తాయట. ముఖ్యంగా 2 (చంద్రుడు – మనస్సు) మరియు 4 (రాహువు) కలిస్తే నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం ఏర్పడుతుందని చెప్తున్నారు న్యూమరాలజిస్టులు.
టోటల్ నంబర్ (మొత్తం కలిపితే వచ్చే సంఖ్య): మొబైల్ నంబర్‌లోని 10 అంకెలను కలిపితే వచ్చే సింగిల్ డిజిట్ (Single Digit) కూడా చాలా ముఖ్యమట. మొత్తం కూడితే 4, 8 సంఖ్యలు వస్తే అది అందరికీ సెట్ కాదట. దీనివల్ల నిరంతరం ఏదో ఒక పోరాటం చేయాల్సి రావచ్చట. అలాగే టోటల్ 13, 16, 18 వంటి సంఖ్యలు రావడం కూడా అంత శ్రేయస్కరం కాదని సూచిస్తున్నారు నిపుణులు.
నంబర్‌లో అంకెలు ఎప్పుడూ పెరుగుతున్న క్రమంలో (Ascending order) ఉండాలట (ఉదా: 5, 7, 9) అలా కాకుండా తగ్గుతున్న క్రమంలో (ఉదా: 9, 8, 4) ఉంటే మీ జీవితంలో ఎదుగుదల అనేది తగ్గిపోతుందట. ఇంకా మీ పుట్టిన తేదీకి (Birth Date) వ్యతిరేకమైన సంఖ్య మీ మొబైల్ నంబర్‌లో ఉండకూడదట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.