E-Paper
Advertisement

Ugadi panchangam 2026: మకర రాశికి ఈ సంవత్సరం ఆర్థిక అభివృద్ది, స్థిరత్వం

Ugadi panchangam 2026: మకర రాశికి ఈ సంవత్సరం ఆర్థిక అభివృద్ది, స్థిరత్వం
Advertisement

Ugadi panchangam 2026: ఈ పరాభవ నామ సంవత్సరం మకర రాశి వారికి కెరీర్ పరంగా అద్బుతమైన పురోగతి సాధిస్తారట. ఆర్థికపరంగా ఊహించని అభివృద్ధి పొందుతారని పండితులు చెప్తున్నారు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో శని మూడవ ఇంట ఉండటంతో ధైర్యం.. చేపట్టిన అన్ని పనుల్లో విజయం పొందుతారట. అలాగే సంవత్సరం ద్వితీయార్థంలో గురువు ఏడవ ఇంట ఉండటంతో రాజయోగం, వివాహ యోగం ఉంటుందట. ఇక ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లభిస్తాయట. విదేశీయానం చేయడానికి అవకాశాలు వస్తాయట..

ఈ సంవత్సరం ఈ రాశి జాతకులు స్థిరాస్థి కొనడమే కాకుండా వాహనయోగం కూడా ఉందట. సామాజికంగా గౌరవం హోదా పెరుగుతాయట. ఎన్నో రోజులు నుంచి ఆశయాలు ఈ సంవత్సరం నెరవేరతాయట.  కానీ ఆరోగ్య విషయంలో ఈ రాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పండితులు. మకరరాశిలోకి ఉత్తరాషాడ 2,3,4 పాదాలు, శ్రవణం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు..  ధనిష్ఠ నక్షత్రం ఒకటి, రెండు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం మకర రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం1, అవమానం 2గానూ ఉన్నాయి.

కేరీర్‌ అండ్‌ ఉద్యోగం:

Advertisement

ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రథమార్థం మకర రాశి వాళ్లకు ఆఫీసులో పని ఒత్తిడి ఉంటుంది. సహ ఉద్యోగులతో మనఃస్పర్థలు ఏర్పడతాయి. అలాగే ద్వితీయార్థంలో అద్బుతమైన ఉద్యోగ కాలం నడుస్తుంది. అనుకున్న ప్రమోషన్లు లభిస్తాయి. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం స్వర్ణయుగం అని చెప్పొచ్చు.. ఏవే వ్యాపారం చేసినా మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుందట.

ఆర్థిక పరిస్థితి:

మకర రాశి జాతకులు ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువ అవుతాయట. అప్పులు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ద్వితీయార్థం మాత్రం అద్బుతంగా ఉంటుందట. వ్యాపారంలో లాభాలు రావడంతో అద్బుతమైన ఆర్థిక పురోగతి ఉంటుందట. మీ జీవిత భాగస్వామి లేదా..? వ్యాపార భాగస్వామి ద్వారా ధనయోగం కలుగుతుందట.

ఆరోగ్యం:

Advertisement

మకర రాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఉదర సమస్యలు, కాలేయ సమస్యలు వచ్చే అవకాశ ఉందట. అయితే ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుందని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్తున్నారు పండితులు.

కుటుంబం అండ్‌ వివాహం:

ఈ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశిలో ఎవరైనా పెళ్లి కానీ వారు ఉంటే వారికి వివాహం అవుతుందట. అలాగే కుటుంబంతో సంతోషంగా ఉంటారట. ఇక ద్వితీయార్థంలో గురువు ఉచ్చలో ఉండటం చేత దాంపత్యంలో అన్యోన్యత ఉంటుందట.

పరిహారాలు:

ఈ రాశి వారు ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాల కోసం గురువారం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం.. శనగలు, పసుపు వస్త్రాలు దానం చేయాలట. అలాగే హనుమాన్‌ చాలీసా పారాయణ చేయాలట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ధనస్సు రాశికి కలలు నెరవేరే టైం వచ్చింది.

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×