E-Paper
Advertisement

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?
Advertisement

BIG TV Originals: భారత్ లో కోట్ల రూపాయలతో నిర్మించాలనుకున్న ఓ కలల నగరం.. ఇప్పుడు నిశ్శబ్దానికి నిలయంగా మారింది. ఇటలీని తలపించే అందమైన భవనాలు, ప్రశాంతమైన సరస్సు, ఖాళీ వీధులు ఓ ప్రత్యేక పర్యాటక కేంద్రంగా మార్చాయి. ఒకప్పుడు భారీ ఆశలకు ప్రతీకగా నిలిచిన ఈ నగరం ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. ఎందుకలా అయ్యింది? అసలు కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటలీని తలపించే లవాసా!

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలనుకున్న ప్రైవేట్ హిల్ సిటీ లావాసా. మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల మధ్య ఉంటుంది. ఒకప్పుడు లక్షల మంది నివసించే ఆధునిక నగరంగా నిర్మించాలని భావించారు. ఇటలీలోని ప్రసిద్ధ పోర్టోఫినో నగరాన్ని ఆదర్శంగా తీసుకుని, రంగురంగుల భవనాలు, సరస్సు ఒడ్డున అందమైన రోడ్లు, యూరోపియన్ శైలిలో వీధి దీపాలతో తీర్చిదిద్దారు. కానీ, ఆ భారీ కలల ప్రాజెక్టు కలగానే మారిపోయింది.

భారీ ప్రణాళిక.. మధ్యలోనే ఆగిన నిర్మాణం

Advertisement

2000వ దశకంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును సుమారు 25 వేల ఎకరాల్లో, ఏడు కొండలపై అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. సుమారు మూడు లక్షల మందికి నివాసంగా ఉండేలా విలాసవంతమైన ఇళ్లు, హోటళ్లు, పాఠశాలలు, కార్యాలయాలు, వినోద కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. దాస్వే ప్రోమనేడ్ ఈ నగరానికి ప్రధాన ఆకర్షణగా రూపొందించారు. అయితే, పర్యావరణ అనుమతుల వివాదాలు, చట్టపరమైన సమస్యలు, భారీ అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ప్రాజెక్టుకు పెద్ద దెబ్బ తీశాయి. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయి, లవాసా అసంపూర్తి నగరంగా మిగిలిపోయింది.

ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది?

ప్రస్తుతం లవాసాలో అందమైన భవనాలు కనిపించినా, వాటిలో చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. కొన్ని హోటళ్లు పూర్తికాకుండా నిలిచిపోయాయి. విశాలమైన వీధుల్లో జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. ఒకప్పుడు సందడిగా ఉండాల్సిన ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తుంది. అయితే, ఇదే నిశ్శబ్దం ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. నగరాల రద్దీకి దూరంగా కొన్ని రోజులు గడపాలనుకునే పర్యాటకులు, ఫోటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు లవాసాను ఎక్కువగా సందర్శిస్తున్నారు.

వర్షాకాలంలో మరింత అందం

Advertisement

లవాసాను చూడాలంటే వర్షాకాలం బెస్ట్ అని చాలామంది చెబుతారు. ఈ సమయంలో సహ్యాద్రి కొండలు పచ్చదనంతో కళకళలాడుతాయి. పొగమంచు, చిన్నచిన్న జలపాతాలు, సరస్సు అందాలు కలిసి ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. దాస్వే సరస్సు ఒడ్డున నడవడం అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో సుదీర్ఘంగా నడుస్తూ ప్రకృతి అందాలను అస్వాదించే అవకాశం ఉంటుంది. అలాగే వారస్‌ గావ్ డ్యామ్ జలాశయం, లోయల అందాలు కనిపించే వ్యూ పాయింట్లు కూడా సందర్శకులను ఆకట్టుకుంటాయి. లవాసాలోకి వెళ్లేందుకు ఇప్పటికీ కారుకు ఎంట్రీ ఫీజు రూ. 500, బైక్ కు ఎంట్రీ ఫీజు సుమారు రూ.200 వరకు వసూళు చేస్తారు.

సినిమాలకు ఫేవరెట్ లొకేషన్!

లవాసాలోని యూరోపియన్ స్టైల్ భవనాలు, సరస్సు ఒడ్డు, అందమైన వీధులు సినీ దర్శకులను కూడా ఆకట్టుకున్నాయి. అక్కడ తెలుగు సినిమాలను కూడా షూట్ చేశారు. మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ప్రభాస్ ‘మిర్చి’ సినిమాల్లో పాటలను ఇక్కడ చిత్రీకరించారు. బాలీవుడ్ కు సంబంధించి ‘కిల్ దిల్’, ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’, ‘జై హో’ లాంటి సినిమాల షూటింగ్ కూడా లవాసాలో జరిగింది. ప్రస్తుతం కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, మ్యూజిక్ వీడియోలు, టీవీ యాడ్స్ కోసం ఇక్కడ షూటింగ్స్ చేస్తున్నారు. విదేశాలకు వెళ్లకుండానే యూరప్‌లో ఉన్న అనుభూతిని కలిగించే లొకేషన్‌ గా లవాసా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

లవాసాకు ఎలా వెళ్లాలి?

లవాసా పూణే నుంచి ఇది సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణానికి దాదాపు రెండు గంటలు పడుతుంది. ముంబై నుంచి సుమారు 186 కిలోమీటర్ల దూరం ఉండి, నాలుగు నుంచి ఐదు గంటల్లో చేరుకోవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ముందుగా పూణేకు రైలు లేదంటే విమానంలో చేరుకుని, అక్కడి నుంచి టాక్సీ, అద్దె కారులో లవాసాకు వెళ్లవచ్చు.

Read Also: వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×