E-Paper
Advertisement

Actor Shivaji: భవిష్యత్తులో దుబాయ్‌కు బదులు అమరావతి.‌..శివాజీ కామెంట్స్ వైరల్

Actor Shivaji: భవిష్యత్తులో దుబాయ్‌కు బదులు అమరావతి.‌..శివాజీ కామెంట్స్ వైరల్
Advertisement

Actor Shivaji: ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరస్ అవుతున్నాయి. ప్రపంచ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో, భారతదేశం కూడా భవిష్యత్తు కోసం పెద్ద ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అమరావతి గురించి ఆయన చెప్పిన విషయాలు చాలా మందిని ఆలోచింపజేశాయి.

శివాజీ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో దుబాయ్ ఒక ముఖ్యమైన సెంటర్‌గా మారిందని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి విమానాలు అక్కడికి వచ్చి పోతుంటాయి. కానీ యుద్ధ పరిస్థితులు లేదా ఇతర సమస్యలు వస్తే దుబాయ్ పరిస్థితి ఎలా మారుతుందో ఇప్పుడే మనం చూస్తున్నామని అన్నారు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారతదేశం కూడా ఒక పెద్ద సర్వీస్ హబ్‌ను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.

Advertisement

ఈ సందర్భంలో అమరావతి చాలా మంచి స్థానం కలిగిన నగరమని శివాజీ చెప్పారు. ప్రపంచ మ్యాప్‌లో చూస్తే అమరావతి భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతంలో ఉంటుంది. అందువల్ల ఇక్కడి నుంచి వెళ్లే విమానాలకు ఎక్కువ ఇంధనం అవసరం ఉండదు. ఇక ఇదే విషయం గురించి శివాజీ చెప్పుకొచ్చారు.

అమరావతిలోనే అది సాధ్యం..!

ఉదాహరణకు, ఒక విమానం సుమారు 16 గంటల ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చినప్పుడు, ఆ విమానానికి చిన్న చిన్న సర్వీసులు అవసరం అవుతాయి. ఇంధనం నింపడం, టెక్నికల్ చెకింగ్, ఇతర నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుంది. అలాంటి సేవల కోసం అమరావతిని ఒక హబ్‌గా అభివృద్ధి చేయవచ్చని శివాజీ అభిప్రాయపడ్డారు.

Advertisement

అమరావతి నుంచి బయలుదేరే విమానాలకు పూర్తిగా ట్యాంక్ నింపాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కొంత ఇంధనం నింపినా దుబాయ్ లేదా సింగపూర్ వంటి పెద్ద నగరాలకు వెళ్లి రావచ్చు అని ఆయన తెలిపారు. ఈ కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలు కూడా అమరావతి వైపు ఆసక్తిగా చూస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో సరైన ప్రణాళికలు.. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే అమరావతి అంతర్జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన సర్వీస్ సెంటర్‌గా మారే అవకాశం ఉందని శివాజీ అభిప్రాయపడ్డారు. భారతదేశం అభివృద్ధిలో అమరావతి కూడా కీలక పాత్ర పోషించవచ్చని ఆయన అన్నారు.

ఇప్పటికే శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ.. సామాజిక వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యనే శివాజీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి పరవాలేదు అనిపించుకున్నారు. ఈ సినిమాలో ఎన్నో సంవత్సరాల తర్వాత శివాజీ తో లయ నటించడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపించారు.

ALSO READ: Dhurandhar 2 Trailer: పాకిస్తాన్ భవిష్యత్తు హిందుస్తాన్ నిర్ణయిస్తుంది.. ప్రతీకారంతో నిండిపోయిన ధురంధర్ 2 ట్రైలర్..!

Related News

చిరంజీవి ‘మెగా158’ ప్రాజెక్ట్‌లోకి థమన్ ఎంట్రీ.. ఓపెనింగ్‌కు చీఫ్ గెస్ట్‌ ఎవరంటే?

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా!.. కారణం ఏంటంటే?

బాలయ్య బాబు ‘NBK111’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్‌గా మంచు మనోజ్..

సమాజ సేవలో యువ నటుడు సంజోష్.. స్కాలర్‌షిప్స్ పంపిణీ!

‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్!’.. ఎన్టీఆర్‌పై అల్లు అర్జున్ క్రేజీ ట్వీట్..

టాలీవుడ్ ‘రాక్ స్టార్’ మంచు మనోజ్ బర్త్‌డే స్పెషల్.. నెపోటిజం నుంచి బయటకు వచ్చి..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన డైరెక్టర్ .. మళ్ళీ అదే ఫార్మాట్ లో గ్లింప్స్..

తెలుగువన్ ప్రొడక్షన్స్‌లో రెండో సినిమా షురూ.. దర్శకుడిగా కంఠంనేని రవిశంకర్!

Big Stories

Advertisement
×