E-Paper
Advertisement

Gemstone: ఏ రాశి జాతకులకు ఏ స్టోన్ కలిసి వస్తుందో తెలుసా – జాతి రత్నాలు ఎలా ధరించాలంటే..?

Gemstone: ఏ రాశి జాతకులకు ఏ స్టోన్ కలిసి వస్తుందో తెలుసా – జాతి రత్నాలు ఎలా ధరించాలంటే..?
Advertisement

Gemstone: ఏ రాశి జాతకులు ఏ జాతి రత్నాన్ని ధరించాలో తెలుసా..? ఏ మెటల్‌లో కలిపి రింగ్‌ చేయించుకోవాలో తెలుసా..? ఏ వేలికి రింగ్‌ తొడిగితే అదృష్టం వరిస్తుందో తెలుసా..? అసలు జ్యోతిష్య నిపుణులు ఏం చెప్తున్నారు లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనుషుల డెస్టినీ మారాలంటే జాతి రత్నాలను ధరిస్తుంటారు. ఈ జాతి రత్నాలను రింగులో పొదిగించుకుని ధరించడం ఒక్క హిందూ సంప్రదాయంలోనే కాదు.. ప్రతి కమ్యూనిటీలోనూ ఉంటుంది. దేశ కాల పరిస్థితులను బట్టి రత్నాలు ధరించే పద్దతులు మారుతుంటాయి కానీ ధరించడం మాత్రం  పక్కాగా ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన రాశిని బట్టి ఆయా వ్యక్తులు ఏఏ జాతి రత్నాలు ధరించాలి. ఏ మెటల్‌లో పొదిగించి రింగ్‌ చేయించుకోవాలి. ఏ వేలికి ధరించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేష రాశి (Aries): ఈ రాశి జాతకులు ధరించవలసిన స్టోన్‌ పగడము (Red Coral), ఈ పగడాన్ఇన బంగారంతో కలిపి రింగ్‌ చేయించుకుని కుడి చేతి అనామిక వేలు ( ఉంగరపు వేలు) కు ధరించాలని పండితులు సూచిస్తున్నారు.

వృషభ రాశి (Taurus):  ఈ రాశి జాతకులు ధరించవలసిన స్టోన్‌ వజ్రం (Diamond), వజ్రాన్ని ప్లాటినం లేదా వెండి తో కలిపి రింగ్‌ చేయించుకుని మధ్య వేళికి ధరించాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

Advertisement

మిథున రాశి (Gemini): ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు పచ్చ రాయి (Emerald)  ధరించాలని సూచిస్తున్నారు. అది కూడా బంగారం లేదా వెండి లోహంతో ఉంగరం చేయించుకుని చిటికెన (Little Finger) వేలికి ధరించాలట.

కర్కాటక రాశి (Cancer): ఈ రాశి జాతకులు ముత్యం (Pearl) ధరించాలని అది కూడా వెండితో చేయించిన ఉంగరంలో పొదిగించి చిటికెన (Little Finger) వేలికి ధరించాలని సూచిస్తున్నారు.

సింహ రాశి (Leo): ఈ రాశిలో పుట్టినవారు ధరించాల్సిన రత్నం మాణిక్యం (Ruby / Manikyam) ఇది బంగారంతో చేయించిన ఉంగరంలో పొదిగించి అనామిక వేలు ( ఉంగరపు వేళు)కు ధరించాలట.

కన్య రాశి (Virgo): ఈ రాశి జాతకులు పచ్చ రాయి (Emerald) ధరించాలని పండితులు సూచిస్తున్నారు. అది కూడా వెండితో చేసిన రింగ్‌లో పొదిగించి చిటికెన (Little Finger) వేలికి ధరించాలట.

తులా రాశి (Libra): ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఓపాల్ (Opal) లేదా వజ్రం (Diamond) వెండితో చేసిన రింగులో పొదిగించి అనామిక వేలు (ఉంగరపు వేళు)కు ధరించాలట.

వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశి జాతకులు పగడము (Red Coral) రాగితో కానీ బంగారంతో కానీ చేసిన ఉంగరంలో పొదిగించి ఉంగరపు వేలుకు ధరించాలని పండితులు సూచిస్తున్నారు.

ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు కనక పుష్యరాగం బంగారంతో చేయించిన ఉంగరంలో పొదిగించి చూపుడు వేలుకు ధరించాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

మకర రాశి (Capricorn): ఈ రాశి జాతకులు ధరించాల్సిన రత్నం నీలం (Blue Sapphire / Neelam). ఈ నీలాన్ని వెండితో చేయించిన ఉంగరంలో పొదిగించి మధ్య వేలికి ధరించాలట.

కుంభ రాశి (Aquarius): ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు నీలం (Blue Sapphire) ధరించాలని.. అది వెండితో చేయించిన ఉంగరంలో పొదిగించి మధ్య వేలికి ధరించాలని సూచిస్తున్నారు పండితులు.

మీన రాశి (Pisces): ఈ రాశి జాతకులు కనక పుష్యరాగం, బంగారంతో చేయించిన ఉంగరంలో పొదిగించి చూపుడు వేలికి ధరించాలని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం ఏ హోమం చేయాలో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×