E-Paper
Advertisement

టాటా టియాగో EV ఫేస్‌ లిఫ్ట్ లాంచ్.. రేంజ్, ఫీచర్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

టాటా టియాగో EV ఫేస్‌ లిఫ్ట్ లాంచ్.. రేంజ్, ఫీచర్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
Advertisement

2026 Tata Tiago EV Launch: ఎలక్ట్రిక్ కారు లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 2026 టాటా టియాగో ఈవీ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టియాగో ఈవీకి ఇప్పుడు కొత్త లుక్, మరిన్ని ఫీచర్లు, అదిరిపోయే రేంజ్‌ తో  అప్ డేట్ అయ్యింది. ఐసీఈ టియాగో ఫేస్‌ లిఫ్ట్‌ తో పాటు ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్‌ ను కూడా టాటా మోటార్స్ మార్కెట్ కు పరిచయం చేసింది.

ఆకట్టుకునే డిజైన్

కొత్త టియాగో ఈవీ బాహ్య డిజైన్‌ లో పలు మార్పులు తీసుకొచ్చింది. ముందు భాగంలో సన్నగా ఉండే కొత్త ఎల్ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌ తో పాటు కనుబొమ్మ ఆకారంలో ఉన్న డీఆర్‌ఎల్స్‌ ను యాడ్ చేసింది. బాడీ కలర్‌ లో క్లోజ్డ్ గ్రిల్, కొత్త బంపర్ డిజైన్, నిలువుగా ఉండే బ్లాక్ ట్రిమ్స్ మరింత ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ స్టైల్ టెయిల్ ల్యాంప్స్‌ ను తీసుకొచ్చింది. అలాగే కొత్త ఏరో డిజైన్ వీల్స్, రియర్ స్పాయిలర్ కూడా ఈ కారులో తీసుకొచ్చింది.

ఇంటీరియర్ లో క్రేజీ మార్పులు

Advertisement

ఇంటీరియర్‌ లో కూడా కీలక మార్పులు చేసింది. టూ టోన్ బ్లాక్ అండ్ గ్రే థీమ్‌ తో కొత్త డాష్‌ బోర్డ్ డిజైన్ ఇచ్చింది.  ఫ్లోటింగ్ స్టైల్ టచ్‌ స్క్రీన్, కొత్త డ్రైవర్ డిస్‌ ప్లే, సెంటర్ కన్సోల్‌ లో మార్పులు ఈ కారును మరింత ఆకట్టుకునేలా చేస్తున్నాయి. గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ వల్ల క్యాబిన్‌ కు ప్రీమియం ఫీల్ వచ్చింది.

అదిరిపోయే ఫీచర్లు

ఇక ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, రియర్ ఏసీ వెంట్స్, డ్యూయల్ వైర్‌ లెస్ ఛార్జర్లు, ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పవర్డ్ ఓఆర్వీఎంలు, కూల్డ్ గ్లోవ్ బాక్స్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం స్టాండర్డ్‌ గా ఆరు ఎయిర్‌ బ్యాగ్స్ తీసుకొచ్చింది.

మరింత పెద్ద బ్యాటరీ

Advertisement

బ్యాటరీ, రేంజ్ విషయంలోనూ కొన్ని అప్ డేట్స్ తో తీసుకొచ్చింది. ప్రస్తుతం టియాగో ఈవీ 19.2kWh, 24kWh బ్యాటరీ ప్యాక్‌ లతో వస్తోంది. ఇవి వరుసగా 223 కిలోమీటర్లు మరియు 293 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తున్నాయి. అయితే, కొత్త వెర్షన్‌ లో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ లను తీసుకొచ్చింది. రేంజ్ కూడా పెరగనుంది. పంచ్ ఈవీలో వాడిన కొత్త 6 ఇన్ 1 ఎలక్ట్రిక్ డ్రైవ్‌ ట్రెయిన్ టెక్నాలజీని కూడా ఇందులో ఉపయోగించింది. దీంతో రేంజ్‌తో పాటు పనితీరు మరింత మెరుగయ్యింది.

ధర ఎంత అంటే?

ఇక ధర విషయానికి వస్తే, ప్రస్తుతం టియాగో ఈవీ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షల వరకు ఉంది. కొత్త ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్ ధర కాస్త పెరగనుంది. అయితే, వినియోగదారులపై ప్రారంభ భారం తగ్గించేందుకు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) పథకాన్ని కూడా టాటా తీసుకొచ్చింది. కొత్త టాటా టియాగో ఈవీ మార్కెట్ లో ఎంజీ కామెట్, సిట్రోయెన్ ఈసీ3 లాంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: ఒక్క ఛార్జ్‌ తో 579 కి.మీ ప్రయాణం.. భారత్ లో హైరేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×