E-Paper
Advertisement

Hero Glamour X: హీరో గ్లామర్ X కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Hero Glamour X: హీరో గ్లామర్ X కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Advertisement

Hero Glamour X 125: హీరో మోటార్ సైకిల్ కంపెనీ నుంచి విడుదలైన గ్లామర్ బైక్ కు ఏ రేంజ్ లో ప్రజాదరణ ఉందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్ లోకి అడు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి అమ్మకాలతో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఈ బైక్ బోలెడు అప్ డేట్స్ తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హీరో గ్లామర్ X 125 గా షో రూమ్ లలో సేల్ అవుతోంది. డైలీ కమ్యూటర్ బైక్ గా ఫీచర్ రిచ్ ఆఫర్లతో ఆకట్టుకుంటుంది. ఒకవేళ మీరు కూడా గ్లామర్ X బైక్ కొనుగోలు చేయాలనుకుంటే, కచ్చితంగా కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. అవేంటంటే..

హీరో గ్లామర్ X  ఇంజిన్‌ గురించి..  

హీరో గ్లామర్ X 124.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. ఇది Xtreme 125Rలోని అదే యూనిట్ ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్ 8,250rpm దగ్గర 11.4hp పవర్, 6,500rpm దగ్గర 10.5Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

గ్లామర్ X.. గ్లామర్ XTEC మధ్య తేడాలేంటి? 

Advertisement

రెండు బైక్స్ 124.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. అయితే, గ్లామర్ X కొంచెం ఎక్కువ పవర్ ను అందిస్తుంది. టార్క్ విషయానికి వస్తే దాదాపు సమయానంగా ఉంటాయి. గ్లామర్ X మూడు రైడింగ్ మోడ్స్తో వస్తుంది.  పవర్, రోడ్, ఎకో మోడ్స్ ను కలిగి ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్‌ తో సెగ్మెంట్ ఫస్ట్ రైడ్ బై వైర్ థ్రోటిల్‌ను కూడా పరిచయం చేస్తుంది.  రెండు బైక్‌లు ఒకే అండర్‌ పిన్నింగ్స్‌ పై ఉంటాయి. కానీ, బరువు, సీటు ఎత్తు, గ్రౌండ్ క్లియరెన్స్ లాంటి అంశాల్లో కాస్త తేడాలు ఉంటాయి.

గ్లామర్ X కీలక ఫీచర్లు

హీరో గ్లామర్ X క్రూయిజ్ కంట్రోల్, మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. రైడ్ బై వైర్ థ్రోటిల్ ను కలిగి ఉంటుంది. బ్లూటూత్‌ కనెక్టివిటీ, కలర్ LCD, పానిక్ బ్రేక్ అలర్ట్, ఆటో అడ్జస్టింగ్ LED హెడ్‌ లైట్  లాంటి ఫీచర్లు కలిగి ఉంటుంది.

హీరో గ్లామర్ X ఏ బైక్స్ తో పోటీ పడుతుందంటే?   

Advertisement

హీరో గ్లామర్ X బైక్ మార్కెట్ లో హోండా SP 125, TVS రైడర్ 125, బజాజ్ పల్సర్ 125 సహా పలు 125cc కమ్యూటర్ మోటార్ సైకిళ్లతో పోటీ పడుతుంది. ఇది హీరో  గ్లామర్ XTECతోనూ పోటీ పడుతోంది. బ్రాండ్ 125cc లైనప్‌లో మరింత సరసమైన ప్రత్యామ్నాయంగా గుర్తింపు తెచ్చుకుంది.

కొత్త హీరో గ్లామర్ X ధర ఎంతంటే?

హీరో గ్లామర్ X రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి ముందు డ్రమ్ బ్రేక్‌ తో వస్తుంది. మరొకటి ముందు డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. రెండూ వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌ ను కలిగి ఉంటాయి. డ్రమ్  వేరియంట్ ధర రూ. 84,467 కాగా, డిస్క్  వేరియంట్ ధర రూ. 93,686గా కంపెనీ నిర్ణయించింది.  ఆన్ రోడ్ ధర మరికాస్త ఎక్కువగా ఉంటుంది.

Read Also: సూపర్ లుక్, అంతకు మించి మైలేజ్, హీరో జూమ్ 160 అదుర్స్ అంతే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×