E-Paper
Advertisement

హెల్మెట్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? ఇవిగో షాకింగ్ నిజాలు!

హెల్మెట్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? ఇవిగో షాకింగ్ నిజాలు!
Advertisement

Helmet Expiry Date: చాలా మంది బైక్ రైడర్లు ఒకసారి హెల్మెట్ కొంటే అది విరిగిపోయే వరకు లేదా పోయే వరకు వాడుతూనే ఉంటారు. కానీ.. హెల్మెట్ అనేది పాల ప్యాకెట్ లాగే కొంత కాలం తర్వాత తన శక్తిని కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు. లోపలి భాగం అరిగిపోవడం లేదా పర్యావరణ మార్పుల వల్ల హెల్మెట్ రక్షణ కవచం బలహీనపడుతుంది. ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే దెబ్బను తట్టుకునే సామర్థ్యం పాత హెల్మెట్‌లకు ఉండదు. అందుకే.. హెల్మెట్ ఎక్స్‌పైరీ డేట్ , అది ఎప్పుడు మార్చాలో తెలుసుకోవడం ప్రతి రైడర్‌కు అవసరం.

హెల్మెట్ ఎక్స్‌పైరీ-మీరు తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు:

Advertisement

1. హెల్మెట్ ఎందుకు ఎక్స్‌పైర్ అవుతుంది?
హెల్మెట్ బయటి భాగం గట్టిగా ఉన్నా, అసలు రక్షణ ఇచ్చేది లోపల ఉండే EPS అనే థర్మోకోల్ లాంటి పొర. మనం హెల్మెట్ వాడుతున్న కొద్దీ మన తలలోని నూనెలు, చెమట, మనం వాడే హెయిర్ జెల్స్ , బయట ఉండే కాలుష్యం వల్ల ఈ పొర మెత్తబడిపోతుంది. కాలక్రమేణా ఇది కుంచించుకుపోయి.. ప్రమాదం జరిగినప్పుడు షాక్‌ను తట్టుకునే శక్తిని కోల్పోతుంది.

2. హెల్మెట్ కాలపరిమితి ఎంత?
సాధారణంగా నాణ్యమైన హెల్మెట్ తయారీ తేదీ నుంచి 5 ఏళ్లు, లేదా వాడటం మొదలు పెట్టినప్పటి నుంచి 3 ఏళ్లు వరకు పని చేస్తుంది. చాలా కంపెనీలు హెల్మెట్ లోపల తయారీ తేదీని ముద్రిస్తాయి. ఒకవేళ మీరు హెల్మెట్‌ను నిత్యం ఎండలో.. వానలో వాడుతుంటే అది ఇంకా త్వరగా పాడైపోయే అవకాశం ఉంది.

Advertisement

3. ఒక్కసారి కింద పడితే మార్చేయాల్సిందేనా ?
అవును! ఇది చాలా మందికి తెలియని విషయం. హెల్మెట్ మీ చేతిలో నుంచి గట్టిగా నేల మీద పడినా లేదా చిన్న ప్రమాదానికి గురైనా.. బయటకు ఏమీ కానట్టు అనిపించినా దాన్ని మార్చేయడం బెస్ట్. ఎందుకంటే.. లోపలి రక్షణ పొరలో మైక్రో-క్రాక్స్ ఏర్పడవచ్చు. మళ్ళీ ప్రమాదం జరిగినప్పుడు అది మిమ్మల్ని కాపాడలేదు.

4.ఎప్పుడు మార్చాలో ఎలా గుర్తించాలి?

వదులుగా అవ్వడం: హెల్మెట్ పెట్టుకున్నప్పుడు లోపల ప్యాడింగ్ వదులై.. తల అటు ఇటు ఊగుతుంటే.. అది ఇక పనికిరాదని అర్థం.

బయటి షెల్ దెబ్బతినడం: హెల్మెట్ పైన పగుళ్లు లేదా రంగు వెలిసిపోవడం కనిపిస్తే అది బలహీనపడిందని గుర్తు.

స్ట్రాప్స్ పాడవ్వడం: గడ్డం కింద పెట్టుకునే స్ట్రాప్ లేదా లాక్ సరిగ్గా పని చేయకపోయినా ప్రమాదకరం.

దుర్వాసన: లోపల ఫంగస్ చేరడం లేదా విపరీతమైన వాసన రావడం లోపలి పొరలు పాడయ్యాయని చెప్పడానికి సంకేతం.

Also Read: గాబిట్ స్మార్ట్ రింగ్.. స్టైలిష్ లుక్, అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త వేరబుల్!

రైడర్స్ కోసం మరికొన్ని భద్రతా చిట్కాలు:

ISI మార్క్ గమనించండి: ఎప్పుడూ గుర్తింపు పొందిన నాణ్యమైన బ్రాండెడ్ హెల్మెట్లనే వాడండి. రోడ్డు పక్కన అమ్మే నాసిరకం హెల్మెట్లు కేవలం పోలీసుల నుంచి.. తప్పించుకోవడానికి మాత్రమే  పనికొస్తాయి. ప్రాణాలు కాపాడవు.

పూర్తి హెల్మెట్ వాడండి: హాఫ్ హెల్మెట్ల కంటే.. ఫుల్ ఫేస్ హెల్మెట్లు గడ్డం, ముఖానికి పూర్తి రక్షణ ఇస్తాయి.

శుభ్రత ముఖ్యం: లోపలి ప్యాడింగ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల హెల్మెట్ లైఫ్ కొంచెం పెరుగుతుంది.

“హెల్మెట్ కదా.. బానే ఉంది కదా” అని నిర్లక్ష్యం చేయకండి. మీ ప్రాణం విలువైంది. పాతబడిన హెల్మెట్ పెట్టుకోవడం అంటే రక్షణ లేని గొడుగు పట్టుకుని వానలో వెళ్లడం లాంటిదే. మీ హెల్మెట్ తయారీ తేదీని ఇప్పుడే.. చెక్ చేసుకోండి. అది పాతదైతే.. వెంటనే కొత్తది కొని మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోండి. గుర్తుంచుకోండి. హెల్మెట్ ధర కంటే మీ ప్రాణం చాలా ఎక్కువ.

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×